SSMB 29:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాలు చేసి, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని.. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. నిజానికి ఈయన చేసింది తెలుగు సినిమాలే అయినా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ లభించింది. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ.. ఎంతోమంది తల్లిదండ్రుల గుండెల్లో దేవుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. అంతే కాదు అవసరమైన వారికి సహాయాన్ని అందిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మహేష్ బాబు.. ఇప్పుడు తొలిసారి బౌండరీ దాటబోతున్నారు. అదే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్. కొడితే కుంభస్థలమే ఢీ కొట్టాలి అనే రేంజ్ లో అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మహేష్ బాబు మాత్రం ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే అటు రాజమౌళి(Rajamouli).. ఇటు మహేష్ బాబు నుంచి రాబోతున్న తొలి పాన్ వరల్డ్ మూవీ.. పైగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Bollywood: మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డ స్టార్ హీరో భార్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
రాజమౌళి జైలు నుండి మహేష్ బాబుకు విముక్తి..
ఇక ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో భారీ అంచనాల మధ్య ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి, ఇప్పటికే షూటింగ్ కూడా కొంతమేర పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి.. మహేష్ బాబు పాస్పోర్ట్ లాగేసుకొని ఆయనకు ఎలాంటి వెకేషన్ కల్పించకుండా.. జైలులో బంధించినట్టు తన సినిమా షూటింగ్ కోసమే లాక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మహేష్ బాబుకు ఎప్పుడు విముక్తి కలుగుతుందని అభిమానులు ఎదురు చూడగా.. తాజాగా మహేష్ బాబు చేతికి పాస్ పోర్ట్ లభించింది. దీంతో వెంటనే ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయారు.
రోమ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్ బాబు..
రాజమౌళి అనే జైలు నుండి విముక్తి పొందిన మహేష్ బాబు ఇప్పుడు కుటుంబంతో కలిసి వెకేషన్ లో చిల్ అవుతున్నారు. ఎయిర్ పోర్టులో కెమెరాలకు పాస్పోర్ట్ చూపించి మరీ మహేష్ బాబు వెళ్లడంతో ఈ ఫోటోలు, వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరోప్ లోని ఇటలీ దేశానికి వెళ్లారు. ఇటలీలో పురాతన నగరం అయిన రోమ్ కి వెళ్లడం జరిగింది. అక్కడ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార రోమ్ లో దిగిన పలు ఫోటోలను నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు ఏమైనా షేర్ చేస్తారేమో చూడాలి.అటు సితార కూడా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇకపోతే మహేష్ బాబు ఎక్కువగా యూరప్ దేశాలకే వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇటలీకి ఆయన వెకేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం ఇటలీలో మహేష్ బాబు ఫ్యామిలీ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడి నుంచి వచ్చిన వెంటనే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ 15 తర్వాత ఉంటుందని సమాచారం.