Pushpa2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడిగా నటించిన మూవీ పుష్ప 2.. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతను మోగిస్తుంది. మొదటి వారంలోనే అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఏకంగా 1000 కోట్లు రాబట్టింది. ఇక రెండు వారాలు పూర్తి అయ్యి మూడో వారంలో కూడా కలెక్షన్స్ తగ్గలేదని తెలుస్తుంది.. నిన్న వీకెండ్ కావడంతో కలెక్షన్స్ కాస్త ఎక్కువగానే వసూల్ చేసిందని టాక్ మరి ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం..
2020 లో వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రూ. 500 కోట్ల బడ్జెట్ ను పెట్టారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇండియన్ సినీ చరిత్రలో ఏ హీరోకి, ఏ సినిమాకు జరగని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగిన పుష్ప 2 ఆరు రోజుల్లోనే 1000 కోట్లను రాబట్టింది. మూడు వారాలు అవుతున్న కలెక్షన్స్ తగ్గలేదు. 18 రోజులకు కోట్లు రాబట్టి అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు పడేలా చేసింది సినిమా.. అల్లు అర్జున్ మేనరిజమ్‌తో నార్త్ ఆడియన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇప్పటికే హిందీలో రూ. 900 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించి కనివినీ ఎరుగుని రేంజ్‌లో రికార్డులు నెలకొల్పింది పుష్ప 2..మరి ఇప్పటివరకు ఎంత రాబట్టిందంటే..?
దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు . అంచనాలను నిజం చేస్తూ తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లను ఫినిష్ చేశాడు అల్లు అర్జున్. తద్వారా దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. 2000 కోట్లు ఖచ్చితంగా రాబడుతుందని టాక్ వినిపిస్తుంది.. ఇక 18 రోజుల వరకు రూ.1630 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది.. మరి రెండు వేల కోట్లు రాబడుతుందేమో చూడాలి..
ఇకపోతే సంధ్య థియేటర్ ఘటన వివాదం రోజు రోజుకు ముదురుతుంది. అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చుట్టిముట్టాయి.. నిన్న పోలీసులు vs అల్లు అర్జున్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారుతుంది. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.. ఈ ఇష్యు వల్ల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.