Anushka Shetty : ఎక్కడో యోగా టీచర్ గా పని చేస్తున్న స్వీటీని తీసుకొచ్చి పూరీజగన్నాథ్ (Puri Jagannath).. నాగార్జున (Nagarjuna) హీరోగా వచ్చిన ‘సూపర్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదటి సినిమాతోనే తన అందచందాలతో, నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతోనే తన పేరును అనుష్క శెట్టి(Anushka Shetty)గా కూడా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడికి, టాలీవుడ్ పెద్ద పీట వేసింది. అలా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది అనుష్క. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గానే కాకుండా ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’, సైజ్ జీరో’ వంటి చిత్రాలతో సాహసాలు కూడా చేసింది అనుష్క.
ఎఫైర్ రూమర్స్ పై తొలిసారి స్పందించిన అనుష్క..
సాధారణంగా అనుష్క సినిమాల వరకే స్పందిస్తుంది. ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కానీ, తనపై వస్తున్న రూమర్స్ గురించి కానీ ఆమె పట్టించుకోదు. అయితే తొలిసారి ఒక షోలో పాల్గొన్న అనుష్క.. తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించడంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. అనుష్క ఒకానొక సమయంలో జయప్రద (Jayaprada) హోస్ట్గా ప్రసారమైన టాక్ షో ‘జయప్రదం’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. నీపై వచ్చిన అతి పెద్ద రూమర్ ఏంటి? అని అనుష్క ను అడగగా.. అనుష్క ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచింది.
ఐదు మందితో అనుష్క ఎఫైర్..
అనుష్క మాట్లాడుతూ..”నాకు ఇప్పటికే ఐదు సార్లు పెళ్లయిపోయింది” అని చెప్పింది. దీంతో ఆశ్చర్యంగా “ఎవరెవరితో?” అని జయప్రద అడగగా.. “నాతో పని చేసిన కోస్టార్స్” తో అంటూ సమాధానం ఇచ్చింది అనుష్క. “ఎవరా కో స్టార్స్?” అని జయప్రద అడగగా.. “సుమంత్(Sumanth), గోపీచంద్(Gopichandh), ప్రభాస్(Prabhas ), సెంథిల్ కుమార్ (Senthil Kumar) తో పాటు మరొకరితో నాకు పెళ్లి అంటూ, వారితో నేను ప్రేమలో ఉన్నాను అంటూ వార్తలు సృష్టించారు”. అంటూ హాట్ బాంబు పేల్చి ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా తనపై ఇలాంటి ఎన్నో తప్పుడు రూమర్స్ బయటకు వచ్చినా వాటిపై స్పందించలేదు అనుష్క. దీన్ని బట్టి చూస్తే అనుష్క ఎంత వివాదరహితురాలో అర్థమవుతుంది. సాధారణంగా కాంట్రవర్సీలకు కానీ , వివాదాలకు కానీ దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ తనపై ఇంత ఆరోపణ వచ్చినా కూడా సైలెంట్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి వాటిని అనుష్క పెద్దగా పట్టించుకోదని తెలుస్తోంది.
వివాదరహితురాలిగా గుర్తింపు..
అనుష్క మొదట తన కెరియర్ బిగినింగ్లో సుమంత్, గోపీచంద్ లతో ఎక్కువగా నటించింది. ఆ సమయంలో గోపీచంద్ తో ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ ఆమె స్పందించలేదు. ఆ తర్వాత రాజమౌళి (Rajamouli) ఆస్థాన కెమెరామెన్ సెంథిల్ కుమార్ తో కూడా అనుష్క పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సెంథిల్ కుమార్ కి వివాహం జరిగింది. ఆ పెళ్లికి అనుష్క కూడా వెళ్ళింది. ఇక తర్వాత ప్రభాస్ తో జతకట్టారు. ఇప్పటికీ కూడా ప్రభాస్ ను వివాహం చేసుకోవడానికి సింగిల్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నా.. దీనిపై మాత్రం అనుష్క స్పందించడం లేదు. ఏది ఏమైనా తనపై వచ్చేవి రూమర్సే కాబట్టి, తానేంటో తనకు తెలుసు కాబట్టి, వీటిపై ఆమె స్పందించలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.