BigTV English

Allu Arjun Pushpa 2: ‘పుష్ప2’లో అల్లు అర్జున్‌ని చంపేది ఎవరో తెలిసిపోయింది..!!

Allu Arjun Pushpa 2: ‘పుష్ప2’లో అల్లు అర్జున్‌ని చంపేది ఎవరో తెలిసిపోయింది..!!

Allu Arjun dies in Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప2’ అంత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.


‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో.. సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఇటీవల ఒక గ్లింప్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో సంచలన వ్యూస్‌తో దూసుకుపోయింది. ఒక్క గ్లింప్స్‌తోనే మేకర్స్ మూవీపై అంచనాలను అమాంతంగా పెంచేశారు.

ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశముందని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ వార్తలను ఖండిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప2’ మూవీ ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికే థియేటర్లలోకి వస్తుందంటూ తెలిపారు. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.


బాహుబలి సినిమాలోని క్లైమాక్స్‌లో బాహుబలి పక్కన నమ్మకస్తుడిగా ఉన్న కట్టప్ప చివరకు బాహుబలికి వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. అయితే ఇప్పుడు ఇదే క్లైమాక్స్‌ను దర్శకుడు సుకుమార్ ‘పుష్ప2’కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పుష్ప పక్కన ఉన్న క్యారెక్టర్ కేశవనే పుష్పను చంపబోతున్నట్టు తాజాగా ఓ లీక్ బయటకొచ్చింది. ఈ మేరకు ఈ మూవీలో పుష్ప చనిపోతాడు అంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో పుష్పను ఎవరూ చంపలేరు కాబట్టి.. పుష్పను చంపేవాడు ఎవడు? అనే పాయింట్‌ బేసు చేసుకొని సినిమా నడుస్తుందట. అయితే కొన్ని ప్రలోభాలకు లోబడిన కేశవ పుష్ప పక్కన నమ్మకస్తుడిగా ఉంటూ అతడినే చంపేస్తాడని బయటకొచ్చిన లీకులు చెబుతున్నాయి.

ఇక ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలుండగా.. ఈ తాజా వార్తతో అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్ సినీ ప్రియులు కూడా ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని తెగ ఎదురుచూస్తున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×