BigTV English

Discount on MG Comet EV: ఎలక్ట్రిక్ కారుపై బంపరాఫర్.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్.. త్వరపడండి!

Discount on MG Comet EV: ఎలక్ట్రిక్ కారుపై బంపరాఫర్.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్.. త్వరపడండి!
Mg comet ev price

Rs 1 Lakh Discount on Mg comet EV:


ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల హవా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఈ వెహికల్సే దర్శనమిస్తున్నాయి. ఎక్కువ మైలేజ్, తక్కువ బరువు, పర్యావరణ హితంతో పాటుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు వాహనప్రియులు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌లోకి వస్తుండటంతో ఎలక్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో రోడ్లపై వందల సంఖ్యలో ఇ-వాహనాలు రయ్ రయ్‌మని చక్కర్లు కొడుతున్నాయి.

అయితే కస్టమర్ల డ్రైవింగ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు తమ మోడల్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అంతేకాకుండా వాహన ప్రియులను ఆకర్షించేందుకు కొత్త కొత్త డిజైన్లు, భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటున్నాయి. దీని ద్వారా కంపెనీల సామర్థ్యం మరింత పెంచుకునేందుకు ప్రముఖ కంపెనీలు చూస్తున్నాయి. అందులో ఎంజీ కామెట్ ఒకటి.


రానున్న రోజుల్లో ఎలక్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కస్టమర్ల ఇంట్రెస్ట్ క్యాచ్ చేస్తూ.. ఎంజీ కామెట్ తాజాగా ఓ బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఎంజీ కామెట్ కారు గతేడాది లాంచ్ అయింది. డిజైన్ పరంగా ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాల వారు కూడా ఈ కారుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కారు తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో బాగా అమ్ముడవుతోంది.

ఈ క్రమంలోనే కస్టమర్లను మరింత పెంచుకునేందుకు కంపెనీ మరో ముందడుగు వేసింది. ఈ మేరకు కొత్త సంవత్సరంలో ఈ కారు ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారు బేస్ వేరియంట్ ధరను లాంచింగ్ సంమయంలో రూ.7.98 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ తగ్గింపుతో ఈ కారు రూ.6.99 లక్షలకే అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.1లక్ష డిస్కౌంట్ లభిస్తుందన్న మాట. అందువల్ల తక్కువ ధరలో మంచి డిస్కౌంట్‌తో కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇదొక చక్కటి అవకాశమని చెప్పుకొవచ్చు.

ఫీచర్లు:

చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ కారులో సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది. అలాగే 17.3kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు వస్తుంది. ఈ కారుకు ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తే.. దాదాపు 230 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కంపెనీ దీనిలో రియర్-యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చింది. అంతేకాకుండా ఇది 42 bhp గరిష్ట శక్తిని.. అలాగే 110 Nm టార్క్‌ను ఇస్తుంది.

దీనికి 0 నుంచి 100 శాతం వరకు ఛార్జింగ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. కాగా 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ చేయడానికి కేవలం 5 గంటలు మాత్రమే సమయం పడుతుంది. అయితే దీన్ని నెల రోజుల పాటు నడపడానికి కేవలం రూ.500 మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది.

ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్ సెటప్ ఉంటుంది. మాన్యువల్ ఏసీ, నావిగేషన్ కోసం కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు కూడా అందించారు.

Tags

Related News

Jio Network: జియో, వి నెట్‌వర్క్‌లో అంతరాయం.. అసలు ఏమైంది?

Cooking Oil: ఏంటీ.. వాడేసిన వంట నూనెతో విమానాలు నడిపేస్తారా.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

Chinese Robot: పిల్లలను కనే రోబోలు వచ్చేస్తున్నాయ్.. జస్ట్ ఇలా చేస్తే చాలు, పండంటి బిడ్డ మీ చేతిలో!

Infinix Hot 60i vs Tecno Spark Go: ₹10,000 లోపు ధరలో కొత్త 5G ఫోన్లు.. ఏది బెటర్?

Galaxy S24 Ultra Alternatives: గెలాక్సీ S24 అల్ట్రాకు పోటీనిచ్చే ప్రీమియం ఫోన్లు.. తక్కువ ధర, అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌కు చెక్

Vivo G3 5G Launch: వివో G3 5G విడుదల.. ₹20,000 లోపు ధరలో 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే

Big Stories

×