BigTV English

Allu Arjun: డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలు మహిళా మృతి వరకు.. ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నారో తెలుసా..?

Allu Arjun: డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలు మహిళా మృతి వరకు.. ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నారో తెలుసా..?

Allu Arjun.. అల్లు అర్జున్(Allu Arjun)’పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. అంతేకాదు పుష్ప సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న హీరో కూడా బన్నీ కావడం గమనార్హం. పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ తో సీక్వెల్ కూడా విడుదల చేశారు. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో ‘పుష్ప 2’ విడుదలై సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్ లను అతి తక్కువ సమయంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మార్క్ సెట్ చేసింది ఈ సినిమా. ఇకపోతే మరో హీరో ఈ ఫీట్ ను ఇప్పట్లో అందుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు.


ఇదిలా ఉండగా నిన్న అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది. నాంపల్లి కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీంతో వ్యక్తిగత పూచీ కత్తు పైన అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ లభించింది. కానీ రాత్రంతా జైల్లో ఉన్న ఈయన ఈరోజు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ అవడం దేశవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అల్లు అర్జున్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఆయన తన ప్రవర్తన వల్లే వివాదాల్లో చిక్కుకున్నాడని సమాచారం. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇరుక్కున్న అల్లు అర్జున్..


2014లో అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇరుక్కున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియోలో మద్యం తాగి వాహనం నడుపుతూ హైదరాబాద్ పోలీసులతో గొడవకు దిగినట్లు చూడవచ్చు. అంతేకాదు బ్రీత్ లైజర్ పరీక్ష చేయించుకోవడానికి కూడా నిరాకరించడంతో ఈ పరిస్థితి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో పబ్లిక్ లో ఇమేజ్ కూడా కోల్పోయారు.

కాపీ రైట్ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న అల్లు అర్జున్..

2016లో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘సరైనోడు’. అయితే ఈ సినిమా విడుదల సమయంలో రచయిత వర్మ, అల్లు అర్జున్ అలాగే ఆ సినిమా చిత్ర నిర్మాతలు తన కంటెంట్ దొంగలించారని ఆరోపించారు. ముఖ్యంగా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వర్మ ఆరోపించగా అప్పట్లో ఈ విషయం కాస్త బన్నీకి వ్యతిరేకతగా నిలిచింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ..

అల్లు అర్జున్ 2016లో ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు.. అల్లు అర్జున్ గురించి మాట్లాడమని అడిగితే, ఈయన్ మాత్రం “చెప్పను బ్రదర్” అంటూ చెప్పారు. దీంతో అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. అంతేకాదు అల్లు అర్జున్ చేసిన మాటలను దుయ్యబట్టారు. ఆ తరువాత దిగివచ్చిన అల్లు అర్జున్ వివరణ ఇస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు.

బ్రాహ్మణ మత మనోభావాలు దెబ్బతీశారు..

అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో 2017లో నటించారు. అయితే ఈ సినిమాలో బ్రాహ్మణ గెటప్ ను అల్లు అర్జున్ పోషించారు. ఆ సమయంలో బ్రాహ్మణ సంఘం నుండి విమర్శలను ఎదుర్కొన్నారు. సాంస్కృతిక సున్నితత్వం, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని బ్రాహ్మణ సంఘం ఆరోపించింది. ఈ సంఘటన నిరసనకు కూడా దారితీసింది. అంతేకాదు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అలా అప్పుడు కూడా అల్లు అర్జున్ వార్తల్లో నిలిచారు.

బెనిఫిట్ షోలో మహిళ మృతి..

ఇదిలా ఉండగా పుష్ప 2 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో వేసిన బెనిఫిట్ షో కి అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున తొక్కిసలాట నిర్వహించారు. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. దీనికి తోడు ఆ తొక్కిసలాటలో రేవతి(39) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె కొడుకు(9) మృత్యువుతో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×