BigTV English
Advertisement

Allu Arjun: అంత జరిగినా బుద్ది రాలేదారా.. సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ మరోసారి రచ్చ

Allu Arjun: అంత జరిగినా బుద్ది రాలేదారా.. సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ మరోసారి రచ్చ

Allu Arjun: అల్లు అర్జున్ కు గతేడాది ఏ మాతం కలిసి రాలేదు అన్న విషయం తెల్సిందే. ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్లు బన్నీ  ఏదో చేద్దామనుకున్నాడు.. ఇంకేదో జరిగిపోయింది.  ఫ్యాన్స్ తో కలిసి  సినిమా చూడాలనుకున్న బన్నీ కోరిక.. ఒక మహిళ మరణానికి కారణం అయ్యింది. పుష్ప 2 బెన్ ఫిట్ షో కోసం సంధ్యా థియేటర్ కు వెళ్లిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.


ఇక బన్నీ థియేటర్ కు వెళ్లడం వలనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు.దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం బన్నీ ఇప్పటికే రెండుసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. సొంత పూచికత్తుల మీద రెండు సార్లు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక్కడితో ఈ కేసు ఇంకా పూర్తవలేదు.  ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని  కండిషన్స్  కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది.

అసలు దీనంతటికి కారణం అభిమానులే అని చెప్పుకొస్తున్నారు  కొంతమంది.  వారి అత్యుత్సాహం వలనే ఇదంతా జరిగింది. అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో.. ముందు వెనుక ఆలోచించుకోకుండా తోసుకుంటూ.. తొక్కుకుంటూ  వెళ్లిపోయారు. అసలు కిందేం ఉందో అనేది కూడా లేకుండా  చేయడం వలనే రేవతి మృతి చెందింది అనేది కొందరి భావన. ఇక ఇప్పుడిప్పుడే ఈ వివాదం సద్దుమణిగింది అనుకొనేలోపు మరోసారి సంధ్యా థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేశారు.


Sudheer – Rashmi : తెరపై రొమాన్స్.. ఇంత కక్కుర్తా అంటూ ఫైర్..!

పుష్ప 2 రీలోడెడ్  వెర్షన్ థియేటర్ లో రిలీజ్ అయిన విషయం విదితమే. దీంతో ఈ వెర్షన్ ను కూడా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత హడావిడి చేస్తారో.. అలానే థియేటర్ బయట హడావిడి చేశారు. గుంపులుగా గుమికూడి.. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ అల్లరి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

మొన్న అంత జరిగినా  కూడా బుద్దిరాలేదారా.. ఎందుకు ఇదంతా చేస్తున్నారు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని కొందరు. ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరు కానీ, హీరోల కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు.. ఇదేనా ఫ్యానిజం అంటే అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక బన్నీ కెరీర్ విషయానికొస్తే పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో బన్నీ.. పుష్ప 2 ను మించిన సినిమా అని అనిపించుకుంటాడా.. లేదా.. అనేది చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×