BigTV English

Sudheer – Rashmi : తెరపై రొమాన్స్.. ఇంత కక్కుర్తా అంటూ ఫైర్..!

Sudheer – Rashmi : తెరపై రొమాన్స్.. ఇంత కక్కుర్తా అంటూ ఫైర్..!

Sudheer – Rashmi : సినీ ఇండస్ట్రీలో ఉండే కొన్ని సెలబ్రెటీల జంటలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని చోటు సంపాదించుకుంటాయి. వాళ్లకు పెళ్లిల్లై, పిల్లలు పుట్టాక కూడా వీరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుండు. వీరి కాంబోలో ఏదైనా షో వస్తే బాగుండు. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే బాగుండు అని కోరుకునే ఆడియన్స్ ఎంతోమంది ఉంటారు. అలా సినిమాల్లో ఇప్పటి జనరేషన్లో అనుష్క (Anushka), ప్రభాస్ (Prabhas)ని ఎంతలా అయితే ఇష్టపడతారో.. బుల్లితెర మీద సుధీర్ (Sudheer), రష్మి (Rashmi)జోడీని కూడా అంతే ఇష్టపడతారు. జబర్దస్త్ (Jabardast) ద్వారా రష్మీ, సుధీర్ ల జోడీ కుదిరింది. జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా చేస్తే సుధీర్ టీం లీడర్ గా చేసేవారు.అలా అప్పట్లో జబర్దస్త్ లో సుధీర్ స్కిట్ కంటే ఎక్కువగా రష్మితో రొమాన్స్ చేసే సన్నివేశాలనే చూపించేవారు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని చెబుతూ షో యాజమాన్యం ఎన్నో ఈవెంట్లకు వాడుకున్నారు. ఇక అప్పుడప్పుడు పండగలకు సంబంధించి కొన్ని ఈవెంట్లు అయితే స్పెషల్గా వీరిద్దరికి సంబంధించి కొన్ని స్కిట్లు కూడా చేసేవారు.


మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సుధీర్..

అంతేకాదు ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరికి రెండు మూడు సార్లు పెళ్లి కూడా చేసేసారు. అలా సుధీర్, రష్మీ లు పెళ్లి, ఎంగేజ్మెంట్, లవ్ స్టోరీ, బ్రేకప్ అంటూ ఇలా ఎన్నోసార్లు చాలా షోలలో వీరిని వాడుకొని షో యాజమాన్యం క్యాష్ చేసుకున్నారు. అంతేకాదు రష్మీ, సుధీర్ లకు సంబంధించి ప్రేమాయణం అంటూ షోలో కాస్త ప్రోమో వదిలేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేవారు. ఇక షోలో ఏమైందో తెలుసుకోవడానికి చాలామంది బుల్లితెర ప్రేక్షకులు ఎపిసోడ్ మొత్తం పూర్తిగా చూసేవారు. అలాగే ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్టు కూడా కొన్ని ఎపిసోడ్లలో చూపించి, షో కి భారీ హైప్ పెంచుకునేవారు.అలా సుధీర్, రష్మి ఉన్నారంటే కచ్చితంగా ఆ షో హిట్ అనేలా షో యాజమాన్యం సుధీర్ రష్మీ లను వాడుకుంది.అయితే చాలా రోజుల నుండి సుధీర్ బుల్లితెర మీద కనిపించడం లేదు. జబర్దస్త్ మానేసి వెండితెర మీదికి వెళ్లిపోయారు. ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు, కాలింగ్ సహస్ర, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్,కోతల రాయుడు వంటి కొన్ని సినిమాల్లో చేశారు. అయితే సిల్వర్ స్క్రీన్ మీద సుధీర్ తన అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ ఆయనకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ బుల్లితెర బాట పట్టారు.


సుధీర్ – రష్మీ జోడీపై ఫైర్ అవుతున్న నెటిజన్స్..

అలా సుడిగాలి సుధీర్ రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన ఈవెంట్లో కనిపించారు. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన ఈవెంట్లో మళ్ళీ రష్మితో జత కలిసి హోస్ట్ చేశారు.దాంతో మళ్లీ సుధీర్ రష్మి లకు సంబంధించి రొమాన్స్ మొదలైంది అని, ఈ షో చూసిన చాలామంది ఫైర్ అవుతున్నారు. అంతేకాదు షోలో మాత్రం ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని చూపిస్తారు. కానీ షో అయిపోయాక ఇద్దరు ఏదైనా ఇంటర్వ్యూకి వస్తే మా మధ్య అలాంటిదేమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటారు. అలా షోలో ఒకరకంగా.. షో బయట మరో రకంగా చూపిస్తూ ఎందుకు జనాలను వెర్రోళ్లని చేస్తున్నారు. సిగ్గు లేదా మీకు.. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఈవెంట్ల కోసం రొమాన్స్ చేసుకుంటూ షోలు నెట్టుకు వస్తారు అంటూ సుధీర్ రష్మీ జోడిని చూసి చిర్రెత్తుకుపోయిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇన్ని రోజులు సుధీర్ సైలెంట్ అయిపోయాడు. కానీ మళ్ళీ బుల్లితెర మీద సడన్గా ప్రత్యక్షం అవ్వడంతో సుధీర్ రష్మిల జోడి మళ్లీ మొదలెట్టేసింది. ఇక వీరి ఓవరాక్షన్ తట్టుకోలేం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది డబ్బు కోసం ఇంత కక్కుర్తి ఏంటో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. కానీ మరి కొంతమంది మాత్రం ఈ జంట రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు.

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×