COURT – State vs A Nobody : నేచురల్ స్టార్ నాని (Nani) ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ, వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. మరోవైపు నిర్మాతగా కూడా ఆయన మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే తన స్వంత నిర్మాణ సంస్థ నుంచి క్రియేటివ్ కంటెంట్ తో నాని నిర్మాతగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే నాని తన నిర్మాణ సంస్థ నుంచి ‘కోర్ట్’ (COURT – State vs A Nobody) అనే కొత్త సినిమాని ప్రకటించాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఆరోజు అందరి నోటా ఇదే టాపిక్
రామ్ జగదీశ్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి (Priyadarshi) హీరోగా రూపొందుతున్న కోర్టు రూమ్ డ్రామా ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ (COURT – State vs A Nobody). ‘కోర్ట్’ మూవీలో శివాజీ, సాయికుమార్, రోహిణి మొల్లేటి, హర్ష, ప్రశాంతి తదితరులు నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నాని రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, టైటిల్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు తాజాగా ‘కోర్ట్’ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ ను కూడా ఇచ్చేశాడు నాని.
“మిమ్మల్ని కదిలించే, ప్రతి కోణంలో ఆలోచించేలా చేసే సినిమా ఇది. మార్చి 14న అత్యంత చర్చనీయాంశం అవుతుంది. #కోర్టు మూవీని సమర్పించినందుకు గర్వంగా ఉంది” అంటూ నాని ఈ ఏడాది మార్చి 14 న మూవీ రిలీజ్ కాబోతోందని స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు అదే పోస్ట్ లో నాని షేర్ చేసిన వీడియోలో యుక్త వయసు అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమాయణం, తరువాత అది కోర్టుకు చేరడం జరుగుతుందని అన్పించేలా ఉంది. మరి ఈ టీనేజర్ల లవ్ స్టోరీ ఏంటి? ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
‘డార్లింగ్’ ఈవెంట్ లో మూవీ అనౌన్స్మెంట్
ప్రియదర్శి హీరోగా ‘కోర్ట్’ (COURT – State vs A Nobody) అనే సినిమాను తీస్తున్నట్టు నాని ‘డార్లింగ్’ మూవీ ఈవెంట్ వేదికగా ప్రకటించారు. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన ‘డార్లింగ్’ మూవీ గత ఏడాది రిలీజై, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన నాని… ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఇంటెన్స్ గా సాగబోతోందని తాజాగా నాని రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ అప్డేట్ వీడియోను చూస్తుంటే అర్థం అవుతోంది. మరోవైపు నాని హీరోగా ‘హిట్ 3’తో పాటు పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు.
A film which will move you and make you think in every sense.
Will be the most talked about topic on March 14th.PROUD TO PRESENT #COURT – ‘State vs A Nobody’ pic.twitter.com/jnD4VoIv8u
— Nani (@NameisNani) January 18, 2025