BigTV English

Allu Arjun : క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌కి బ‌న్నీ ఫ్యాన్స్ వార్నింగ్‌

Allu Arjun : క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌కి బ‌న్నీ ఫ్యాన్స్ వార్నింగ్‌
Allu Arjun

Allu Arjun : జ‌బ‌ర్ద‌స్త్ స‌హా ప‌లు సినిమాల్లో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో మెప్పించిన న‌టుడు ముక్కు అవినాష్. సాధార‌ణంగా త‌న షోస్‌, సినిమాలు, సోష‌ల్ మీడియాలో రీల్స్ అంటూ ఉండిన ఈ క‌మెడియ‌న్ ఇప్పుడు అనుకోకుండా కాంట్ర‌వ‌ర్సీలో కూరుకుపోయాడు. అది కూడా బ‌న్నీ ఫ్యాన్స్ దృష్టిలో. అసలేమైంది. బ‌న్నీని, లేదా ఆయ‌న‌ ఫ్యాన్స్‌ని ఈ క‌మెడియ‌న్ ఏమైనా అన్నాడా? అనే వివ‌రాల్లోకి వెళితే, ఇటీవ‌ల అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో బ‌న్నీ గంగ‌మ్మ త‌ల్లి గెట‌ప్‌లో క‌నిపించాడు. అది పాన్ ఇండియా రేంజ్‌లో వైర‌ల్ అయ్యింది.


ముక్కు అవినాష్ బ‌న్నీపై ఉన్న అభిమానంతో అదే ఫొటోను అటు ఇటు ఎడిట్ చేసిన త‌న ఫేస్ ఉండేలా చూసుకుని దాన్ని పోస్ట్ చేసి బ‌న్నీకి బ‌ర్త్ డే విషెష్ చెప్పాడు. అయితే దీనిపై బ‌న్నీ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. ఎడిటింగ్‌లో నీ ఇష్ట‌మొచ్చిన‌ట్టు మార్ఫింగ్ చేస్తావా? అల్లు అర్జున్ చేస్తే గంగ‌మ్మ త‌ల్లిలా ఉంటుంది. నువ్వు చేస్తే ప‌క్కింటి మంగ‌మ్మ‌లా ఉంటుంది అంటూ కామెంట్స్‌తో త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఫోటోను డిలీట్ చేయ‌క‌పోతే బాగోదంటూ వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారు. మ‌రి దీనిపై ముక్కు అవినాష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మ‌రి.

పుష్ప 2 విష‌యానికి వ‌స్తే ఇది తిరుప‌తి శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెరకెక్కుతోంది. సుకుమార్ ద్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మ‌రి పార్ట్ 2లో ఇంకా ఎవ‌రెవ‌రు యాడ్ అవుతారో చూడాలి మ‌రి. అభిమానుల‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.


Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×