BigTV English

Allu Arjun: ముఖ్యమంత్రి పేరు మర్చిపోయావ్ సరే, కనీసం ఈ స్థాయికి తీసుకొచ్చిన దర్శకుడు పేరు కూడా తెలియదా.?

Allu Arjun: ముఖ్యమంత్రి పేరు మర్చిపోయావ్ సరే, కనీసం ఈ స్థాయికి తీసుకొచ్చిన దర్శకుడు పేరు కూడా తెలియదా.?

Allu Arjun : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో సుకుమార్ బన్నీ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ ఆర్య సినిమాతో మొదలైంది. ఆర్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కు ఆ సినిమాతోనే మంచి స్టార్డం కూడా లభించింది. సుకుమార్ ఒక ప్రేమ కథను చెప్పిన విధానం చాలామందికి కొత్తగా అనిపించింది. అక్కడితోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అసలైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. నేడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆ రోజుల్లో నాకు సరైన పోటీ ఎవరైనా ఉన్నాడు అనుకుంటే అది సుకుమార్ అని తనలో తాను ఫీల్ అయినట్లు ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు.


ఇకపోతే సుకుమార్ అల్లు అర్జున్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇకపోతే పుష్ప సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా గుర్తింపుని తీసుకొచ్చింది. తెలుగు సినిమా స్థాయి కూడా అదే రేంజ్ లో పెరిగింది. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించింది. ఒక సందర్భంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పరుగు సినిమా టైంలో నాకు బాగా నచ్చిన ఒక కారు కొనుక్కున్నాను. కారు స్టీరింగ్ మీద చేయి పెట్టి ఇంత దూరం రావడానికి కారణం ఎవరా.? అని ఆలోచిస్తే నాకు మొదట గుర్తించిన పేరు సుకుమార్ అంటూ తెలిపాడు అల్లు అర్జున్. ఆ విషయం చెప్పిన వెంటనే కళ్ళల్లో నీళ్లు కూడా తిప్పుకున్నాడు. అప్పుడు సుకుమార్ కూడా ఏడ్చిన సందర్భం అందరికీ గుర్తు ఉన్నదే.

ఇకపోతే పుష్ప 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ ఏ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అతి త్వరగా వెయ్యి కోట్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా పలు సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. రీసెంట్ గా జరిగిన తెలుగు థాంక్స్ మీట్ లోఅల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలిపారు. అయితే అప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడు అల్లు అర్జున్. ఇక తాజాగా హిందీలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ అందరికీ థాంక్యూ చెప్పాడు.


ఈ సందర్భంలో సుకుమార్ కు థాంక్యూ చెప్తూ.. ఇంత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణమైన బండి సుకుమార్ రెడ్డి అంటూ సుకుమార్ పేరును పలికాడు. సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్. తన సినిమా టైటిల్ కార్డులో బి సుకుమార్ అని పడుతుంది. అయితే అల్లు అర్జున్ మాట్లాడుతూ బండి సుకుమార్ రెడ్డి అని సుకుమార్ పేరు పలికాడు. ఆ పేరు కూడా తప్పు పలికాడు. గతంలో ఇదే అల్లు అర్జున్ నేను ఇంత స్థాయికి రావడానికి కారణం ఎవరు అని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు మొదటి కనిపించిన వ్యక్తి సుకుమార్ అని చెప్పాడు. అటువంటి సుకుమార్ పూర్తి పేరు కూడా తెలియదా.? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Also Read : Madhavan : రూమర్లకు సెటైరికల్ పోస్ట్ తో ఇచ్చిపడేసిన మాధవన్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×