Madhavan : సెలబ్రిటీలు, వాళ్ళు చేయబోయే సినిమాలపై ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చాలావరకు ఆ అస్సలు ఆ పుకార్లను పట్టించుకోరు సెలబ్రిటీలు. కానీ కొన్నిసార్లు మాత్రం సోషల్ మీడియాలో కౌంటర్ వేసి మరీ, అది ఫేక్ న్యూస్ అని ఇచ్చి పడేస్తారు. తాజాగా మాధవన్ (Madhavan) కూడా ఇలాగే చేశారు.
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఎప్పటికప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాల విషయంలో రూమర్లు బయలు దేరుతూనే ఉన్నాయి. అందులో ఏ హీరో నటిస్తే బాగుంటుంది, ఏ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే చర్చ ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే తాజాగా ఎల్సీయూ (LCU)లో భాగంగా కొరియోగ్రాఫర్ కం యాక్టర్ రాఘవ లారెన్స్ ‘బెంజ్’ (Benz) అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టోరీని లోకేష్ అందించారు. అంతేకాకుండా లోకేష్ టీంకు సంబంధించిన వ్యక్తి ఆ మూవీకి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. భాగ్యరాజ్ కన్నన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు యువ గాయకుడు సాయి అభయంకర్‌ని మ్యూజిక్ డైరెక్టర్.
అయితే తాజాగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ ‘బెంజ్’ సినిమాలో మాధవన్ (Madhavan) కూడా నటిస్తున్నాడు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. మొత్తానికి ఆ రూమర్స్ మాధవన్ చెవిన పడడంతో, ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఒక సెటైరికల్ పోస్ట్ ద్వారా రిప్లై ఇచ్చారు. “ఇది నాక్కూడా కొత్త వార్త… వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి క్లూ నా దగ్గర లేదు” అంటూ మాధవన్ ‘బెంజ్’ మూవీలో భాగం కాబోతున్నారు అంటూ వచ్చిన వార్తలపై వెరైటీగా రిప్లై ఇచ్చారు. మొత్తానికి ఆ వార్తలు ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
Hey this is news to me .😂as much as it sounds exciting and I would love to be part of a universe like this. I’m surprised with this news because I have no clue about this. Madhavan joins LCU as he roped in for Raghava Lawrence’s ‘Benz’…. https://t.co/UkYgaidLit
— Ranganathan Madhavan (@ActorMadhavan) December 12, 2024
కాగా మాధవన్ (Madhavan) ఇటీవల కాలంలో సౌత్ నార్త్ తేడా లేకుండా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. తెలుగులో విలన్ గా ట్రై చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో మాధవన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టాడు మాధవన్. ఈ హిందీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మాధవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. యాక్షన్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ డైరెక్టర్ ఇప్పుడు ‘కూలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ రూపొందిస్తున్న ‘కూలీ’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ సినిమాలో విలన్ అంటే హీరో కంటే ఎక్కువగానే ఎలివేషన్ ఉంటుంది. ‘విక్రమ్’ సినిమాలో సూర్య లోని విలనిజాన్ని తెరపై ఆయన చూపించిన తీరు అద్భుతం. రోలెక్స్ పాత్రలో సూర్య అదరగొట్టాడు. ఇప్పుడు ‘కూలి’ సినిమాలో అక్కినేని నాగార్జున నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించబోతున్నాడని అంటున్నారు. మరి ‘బెంజ్’ సినిమాలో ఆ విలన్ పాత్ర ఎవరిని వరిస్తుందో చూడాలి.