Manchu Mohan Babu : ప్రస్తుతం ఏ నోట విన్న మంచు ఫ్యామిలీ గొడవలే వినిపిస్తుంది.. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఇప్పుడు వీరి గొడవల వల్ల అందంతా పోయిందనే చెప్పాలి.. మంచు మనోజ్ తన తండ్రి పై కేసు పెట్టగా.. అటు మంచు మోహన్ బాబు తన కొడుకు, కోడలిపై కేసులు పెట్టారు. అంతేకాదు తన ఇంటికి రావొద్దని చెప్పడంతో మనోజ్ రెచ్చిపోయి గేట్లు తోసుకొని లోపలికి వెళ్లడం గమనార్హం.. ఇదంతా పక్కనపెట్టి పెడితే అసలు గొడవకు కారణం ఏంటి? మొన్నటి వరకు బాగానే ఉన్న ఈ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డు ఎక్కడం ఏంటో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా మంచు మోహన్ బాబు వీలునామా బిగ్ టీవీ తెలిసింది. ఆ విలునామా ప్రకారం ఎవరి పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..
మోహన్ బాబు రాసిన వీలునామా లీక్.. ఏముందంటే?
మంచు మోహన్ బాబు ఇంట గొడవలతో ఆ ఫ్యామిలీ ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన పరువు మొత్తం పోయిందని చెప్పాలి. మంచు మనోజ్ తండ్రి పై కేసు పెట్టడం, మోహన్ బాబు కూడా అతనిపై రివర్స్ లో కేసు పెట్టడం, ఆ మనోజ్ ని ఇంటి నుండి మోహన్ బాబు గెంటేయడం, మనోజ్ ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్లడం, ఇవన్నీ కెమెరాలతో చిత్రీకరిస్తున్న మీడియా పై మోహన్ బాబు దాడి చేయడం, ఆ తర్వాత ఆయన మనోజ్ గురించి సంచలన ఆడియో ని రికార్డు చేసి మీడియా కి వదలడం, మనోజ్ దానిపై మీడియా తో స్పందిస్తూ, సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని, ఆధారాలతో సహా నిజానిజాలు తెలిసేలా చేస్తానని చెప్పడం, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ ని రద్దు చేసుకోవడం, ఇలా ఎన్నో మలుపులతో ఈ వివాదం గత మూడు రోజులుగా ట్రెండింగ్ లో ఉంది.. ఇలాంటి సమయంలో మోహన్ బాబు తన పిల్లలకు రాసిన వీలునామా ఒకటి లీకైంది.
అందులో ఏముందంటే.. మంచు లక్ష్మికి ఫిలిం నగర్ లోని ఇంటిని రాసిచ్చాడు. దాంతో పాటుగా కొన్ని ఆస్తులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే మంచు మనోజ్ కు హైదరాబాద్ శివార్లలో ఒక ఇంటిని రాసి ఇచ్చాడు. ఇక మంచు విష్ణుకు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటుగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పాటుగా ఆస్తులు రాసి ఇచ్చారు. ఇక ఇప్పుడు గొడవ జరుగుతున్న జల్లిపల్లి ఫామ్ హౌస్ మోహన్ బాబు పేరు మీద ఉంది. అలాగే సొంత ఊరిలో ఇల్లు, వ్యవసాయ భూములు ఉన్నాయి. తిరుపతిలో భూములు ఫ్లాట్లు ఉన్నాయి.. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఇల్లులు ఉన్నాయని తెలుస్తుంది..
మనోజ్ గొడవకు కారణం..?
మనోజ్ ఇంత గొడవ చెయ్యడానికి కారణం జల్లిపల్లి లోని ఫామౌస్ కోసం అని తెలుస్తుంది. తన పేరు మీద ఆ ఇల్లును రాసివ్వమని గతంలో చాలా సార్లు అడిగాడట.. కానీ మోహన్ బాబు తన కష్టంతో కట్టించుకున్న ఇల్లు అని ఇవ్వనని చెప్పాడు. విద్యానికేతన్ బాధ్యతల్లో వినయ్ రావడం ఇష్టం కూడా లేదని అందుకే పోలిస్టేషన్ మెట్లేక్కాడని తెలుస్తుంది. మరి ఇందులో నిజమేంత ఉంది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫ్యామిలీ గొడవలు ఎక్కడివరకు వెళ్తాయో చూడాలి..