BigTV English

Chiranjeevi: బన్నీ బెయిల్ కోసం మెగాస్టార్ తెర వెనుక ఇంత కథ నడిపారా..?

Chiranjeevi: బన్నీ బెయిల్ కోసం మెగాస్టార్ తెర వెనుక ఇంత కథ నడిపారా..?

Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా – అల్లు కుటుంబాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలు ఎంతో మందికి ఆదర్శం. అయితే అనూహ్యంగా అల్లు అర్జున్(Allu Arjun)వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ఇటీవల అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మేనమామ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి మద్దతు పలకకుండా.. తన ఫ్రెండ్ వైసిపి నేత శిల్పా రవి రెడ్డికి సపోర్టు చేయడంతో అసలు వివాదం మొదలైంది. ఇక అప్పటినుంచి మెగా , పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు జనసేన శ్రేణులు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. మెగా కుటుంబం వల్లే అల్లు అర్జున్ ఈ స్థాయికి వచ్చినా.. దీనిని అల్లు అర్జున్ ఒప్పుకోవడం లేదని ఎంతోమంది మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు.


సంధ్య థియేటర్ వద్ద ర్యాలీ నిర్వహించిన అల్లు అర్జున్..

ఇక పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా అల్లు అర్జున్ తాను ఐకాన్ స్టార్ అని, వైల్డ్ ఫైర్ అని, తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మెగా కుటుంబం వల్లే బయటపడ్డారు అనేది వాస్తవం. అసలు విషయంలోకి వెళితే.. డిసెంబర్ 4వ తేదీన అల్లు అర్జున్, సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేశారు. హైదరాబాదు సంధ్య థియేటర్లో వేసిన బెనిఫిట్ షో కి అల్లు అర్జున్ ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తూ రావడంతో పోలీస్ కేస్ అయ్యింది. దీనికి తోడు అక్కడ తొక్కిసలాట జరగగా.. అందులో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీ తేజ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.


బన్నీ అరెస్ట్.. బెయిల్ మీద బయటకు..

ఇక దీంతో డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుపరచగా.. నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగడం, ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టులో మాట్లాడకుండా చేయడం, అటు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇప్పించడం ఇలా ఈ పన్నులన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికీ కారణం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అని సమాచారం. ఇకపోతే ఈ కృతజ్ఞతతోనే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి అక్కడ లంచ్ చేసి దీనికి గల పరిణామాలను చర్చించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి హస్తం..

ఇకపోతే అల్లు అర్జున్ కి బెయిల్ రావడం వెనుక చిరంజీవి హస్తము ఉందని సమాచారం.. అసలు విషయంలోకి వెళ్తే.. బన్నీకి బెయిల్ రావడం వెనుక లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగడం, వెనుక చిరంజీవి ప్రమేయం ఉందట. అంతేకాదు ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయన చర్చలు జరిపారట. దీనికి తోడు నిరంజన్ రెడ్డితో చిరంజీవికి మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే తెరవెనుక చిరు చక్రం తిప్పారని, అందులో భాగంగానే నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారని, హైకోర్టు వాదనలకు సంబంధించిన ప్రభుత్వం తరఫున సరైన లాయర్ ని పెట్టకపోవడానికి కూడా చిరంజీవి ప్రభావం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈయన ఇంట్లో కూర్చొని సైలెంట్ గా అటు కోర్టుని ఇటు ప్రభుత్వంతోనూ చక్రం తిప్పి అల్లుడు అల్లు అర్జున్ ని బయటికి వచ్చేలా చేశారని బన్నీ టీం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తన మామయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి స్వయంగా ఫ్యామిలీతో కలిసి బన్నీ చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. మొత్తానికైతే బన్నీ అరెస్ట్ ఎపిసోడ్లో ఆయన బయటకు రావడానికి చిరంజీవి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×