Prabhas Injured : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాలికి మళ్లీ గాయమైనట్టుగా తెలుస్తోంది. ఆయన జపాన్ లో జరగబోతున్న ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) ఈవెంట్ ను స్కిప్ చేయబోతున్నారని సమాచారం. ఈ మేరకు ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘సలార్’ సినిమాతో ప్రభాస్ (Prabhas) స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడంతో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాను అద్భుతమైన యూనిక్ కాన్సెప్ట్ తో ఫ్యూచర్స్టిక్ సినిమాగా తెరపైకి తీసుకొచ్చారు. మహాభారతాన్ని, భవిష్యత్తుకు లింక్ చేయడమే కాకుండా అందులోని అశ్వద్ధామ పాత్రను ఈ సినిమా కథలో భాగం చేసి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి జపాన్ లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కడి అభిమానులు.
గతంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘బాహుబలి’ మూవీ ఇండియాలోనే కాకుండా జపాన్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ని దక్కించుకుంది. అప్పటినుంచి ప్రభాస్ కి జపాన్లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం ‘పుష్ప 2’ వంటి పాన్ ఇండియా సినిమాలు జపాన్లో రిలీజ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాము. ఇక ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘కల్కి’ సినిమాను జపాన్ లో విడుదల చేసి ప్రభాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు చిత్ర బృందం. అందుకే ఈ సినిమాను జపాన్ లో 2025 జనవరి 3న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
【緊急のお知らせ】
この度、12/18(水)に主演を務める
プラバースの初来日を予定しておりましたが、
撮影中の捻挫により、
来日が中止となりました。※ナーグ・アシュウィン監督は来日予定であり、
12/18(水)のジャパンプレミアは
予定通り行います。▼プラバース本人から皆さまへメッセージ pic.twitter.com/vLfXHevkoF
— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 16, 2024
అయితే బాహుబలి మూవీ రిలీజ్ టైంలో ప్రభాస్ (Prabhas) తో పాటు చిత్ర బృందమంతా అక్కడికి వెళ్లి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా ‘కల్కి’ మూవీకి సంబంధించి జపాన్లో మూడు రోజులపాటు ప్రమోషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే, లేదంటే దిశా పటాని, ఇతర చిత్ర బృందం అందరూ జపాన్ కి వెళ్ళబోతున్నారని టాప్ నడిచింది. డిసెంబర్ మూడో వారంలో లేదంటే చివరి వారంలో ప్రభాస్ అండ్ టీం జపాన్లో పర్యటించడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ (Prabhas) కాలికి మళ్ళీ గాయం కావడంతో ఆయన జపాన్ ఈవెంట్ ను స్కిప్ చేయబోతున్నారని తెలుస్తోంది. షూటింగ్ లో ఆయన కాలికి గాయం కావడంతో తాను ఈవెంట్ కి హాజరు కాలేనని ప్రభాస్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. నిజానికి ప్రభాస్ కొంతకాలం నుంచి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఆయన కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి కాలికి గాయంతో ఆయన ‘కల్కి’ జపాన్ ప్రీమియర్ షోలకు హాజరు కాలేనంటూ చెప్పినట్టుగా వస్తున్న వార్తలు డార్లింగ్ ఫ్యాన్స్ ని ఆందోళనలో ముంచెత్తుతున్నాయి. అయితే ముందుగా ప్లాన్ చేసినట్టే డిసెంబర్ 18 న జపాన్ లో ‘కల్కి’ ప్రీమియర్ షోలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీం వెళ్లబోతోందని తెలుస్తోంది.