Allu Arjun : సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం కష్టమే. చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఇప్పుడు స్టార్ రేంజ్ లో హవాని కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్ సినిమాలు తమ అకౌంట్లో పడేకొద్దీ స్టార్ డం పెరగడంతో పాటు ఇమేజ్ కూడా పెరుగుతుంది. దాంతో జనాల్లోకి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. బయటకు వెళ్తున్నారు అంటే తప్పక సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే ఆ ప్రాంతమంతా అలర్ట్ చేస్తుంది.. అలాంటి హీరోలు ఇండ్లలో చుట్టుపక్కల పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా గట్టిగానే ఉంటుంది.. అంతటి భద్రత నడుమ కూడా దుండగులు దాడులు చేయడం మాత్రం ఆగడం లేదు.. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మీద తన ఇంటికి వచ్చే దుండగుడు తనపై హత్యా ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం లోను సంచలనాలు సృష్టించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు అల్లు అర్జున్ కు సంబంధం ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ కేసులోకి అల్లు అర్జున్ ను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు తెలుసుకుందాం..
సైఫ్ అలీ ఖాన్ పై దాడి..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వ్యక్తి దాడి చేసింది కూడా సైఫ్ అలీఖాన్ ఇంట్లోనే.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడినా కానీ అసలు దాడి చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పటివరకు కూడా కనిపెట్టలేదు.. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆయనపై దాడి చేయలేదని విమర్శలు వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఏరియాల్లో సెక్యూరిటీ లేకపోవడం ఏంటి అని మన చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కోట్ల రూపాయల రెమ్యుననేషన్ తీసుకుంటున్న కానీ ఇంటి ముందు సెక్యూరిటీ నియమించు కోలేకపోయిందని అన్నారు. 100 కోట్ల పైగా వస్తే సెక్యూరిటీని పెట్టుకుంటారేమో అప్పుడే వీళ్లకు భయం అనేది కలుగుతుందేమో అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ ఘటనలోకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.
సైఫ్ పై దాడి ఘటనలో అల్లు అర్జున్ పేరు..
సైఫ్ అలీ ఖాన్ దాడి తర్వాత సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు.. ఇదే తరుణంలో ఆ విషయంపై రీసెంట్ గా బాలీవుడ్ దర్శకనిర్మాత ఆకాశ్ దీప్ సబీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ కి ఇప్పుడు వచ్చే కోట్లు సరిపోవడం లేదు. అందుకే సెక్యూరిటీని పెట్టుకోలేకపోతున్నారు వాళ్లకి అల్లు అర్జున్కి ఇచ్చినట్టు 100 కోట్ల పైన రెమ్యూనరేషన్ ఇస్తే అప్పుడు సెక్యూరిటీని పెట్టుకుంటారేమో అని వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.