BigTV English

Allu Arjun : బన్నీ లాస్ట్ 5 సినిమాల బిజినెస్… నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ డిమాండ్

Allu Arjun : బన్నీ లాస్ట్ 5 సినిమాల బిజినెస్… నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ డిమాండ్

Allu Arjun : దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ‘పుష్ప 2’ హడావుడి కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మూవీ లవర్స్ లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమా సినిమాకు ఎదుగుతున్న తీరు అభినందనీయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గత చివరి ఐదు సినిమాల మూవీస్ బిజినెస్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు.


స్టైలిష్ స్టార్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్ (Allu Arjun). ఒక్కో సినిమాకి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నారు ఆయన. ఇండస్ట్రిలోకి అడుగు పెట్టింది మెగా కాంపౌండ్ నుంచే అయినప్పటికీ, ఇప్పుడు కనీసం మెగాస్టార్ మాట కూడా అవసరం లేదు అన్న రేంజ్ కు దూసుకెళ్లారు. బన్నీపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ, ఆయన సినిమాల బిజినెస్ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగడం ఖాయం. బన్నీ గత 5 సినిమాల బిజినెస్ ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా జరిగింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నుంచి మొదలు పెడితే, ఇప్పుడు ‘పుష్ప 2’ వరకు ఆయన మార్కెట్ రోజు రోజుకూ ఊహించని విధంగా పెరుగుతూ వస్తుంది.

అప్పట్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు 54 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ తర్వాత పెద్ద తేడా ఏం లేకుండా ‘సరైనోడు’ సినిమా కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ జరిగింది. కానీ ‘డీజే’ సినిమాకు దాదాపు 24 కోట్ల మేర పెరిగి, 79 కోట్లకు సినిమా బిజినెస్ డీల్ కుదిరింది. ఆ తర్వాత భారీ అంచనాలతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పేరుతో అల్లు అర్జున్ నటించిన సినిమా థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ సినిమా ‘డీజే’ కంటే మూడు కోట్ల తక్కువ ధరకే అమ్ముడైంది. ‘నా పేరు సూర్య’ మూవీ బిజినెస్ 76 కోట్లకు జరిగింది. కానీ ఈ మూవీ బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురం’ (ala vaikuntapuramulo) లో మూవీ బన్నీ కెరీర్ కు గేమ్ ఛేంజర్ గా మారింది. ఈ సినిమా బిజినెస్ 84 కోట్లకు పైగా జరిగింది.


అంతేకాకుండా ఇండస్ట్రీలో ఆల్ టైం హిట్స్ లో ‘అల వైకుంఠాపురంలో’ మూవీ కూడా చోటు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ మార్కెట్ గ్రాఫ్ మరింతగా పెరిగిందని చెప్పాలి. అది ‘పుష్ప 1’ మూవీ తో ప్రూవ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప (Pushpa)’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ మార్కెట్ 100 కోట్లు దాటింది. అమాంతం 144 కోట్లకు పైగా బిజినెస్ జరగడం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతకుముందు ‘అల వైకుంఠపురం’లో సినిమాకు 25 కోట్ల మేర బిజినెస్ జరగగా, ‘పుష్ప’ సినిమాకు ఏకంగా 144 కోట్లకు పైగా బిజినెస్ జరగడం విశేషమే మరి. ఇక ఇప్పుడు అది మూడింతలై “పుష్ప 2″కు మరింత హైప్ పెంచింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ మూవీకి ఏకంగా 617 కోట్ల బిజినెస్ జరగడం షాకింగ్ అని చెప్పాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×