Nargis Fakhri: సినీ సెలబ్రిటీలు అంటేనే వారి పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులు గమనిస్తూనే ఉంటారు. అంతే కాకుండా సినీ సెలబ్రిటీల ఫ్యామిలీస్‌పై కూడా అందరి ఫోకస్ ఉంటుంది. తాజాగా ఒక హీరోయిన్ సోదరి ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ (Nargis Fakhri) సోదరి ఆలియా ఫఖ్రీని న్యూయార్క్ పోలిసులు అరెస్ట్ చేశారు. తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరొకరిని మర్డర్ చేసిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేశారనే వార్త సోషల్ మీడియా ద్వారా బయటికొచ్చింది. ఈ వార్త ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఇద్దరిని హత్య
ఫారిన్ నుండి వచ్చి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అయ్యింది నర్గీస్ ఫఖ్రీ. తన పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే సినిమా ‘రాక్‌స్టార్’. అలా బీ టౌన్‌లో ఒక్క సినిమాతోనే తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నర్గీస్‌పై ఇప్పుడు ఒక బ్లాక్ మార్క్ పడింది. నర్గీస్ సోదరి ఆలియా ఫఖ్రీ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటోంది. తను ఒక గ్యారేజ్‌కు నిప్పు పెట్టడం వల్ల తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఎడ్వార్డ్ జాకోబ్స్ (35), తన ఫ్రెండ్ అనాస్తేసియా ఎట్టినీ (33) మరణించారని పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో నవంబర్ 2న జరిగినట్టు సమాచారం. ఆలియానే ఈ హత్యలు చేసినట్టు పోలీసులు కన్ఫర్మ్ చేశారు.
Also Read: దూరపు కొండలు నునుపు… అనసూయ వార్నింగ్ ఎవరికి?
అందరూ చచ్చిపోబోతున్నారు
క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటోర్నీ అయిన మెలిండా కాట్జ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. 43 ఏళ్ల వయసు ఉన్న ఆలియా ఫఖ్రీ (Aliya Fakhri).. ఒకరోజు ఉదయాన్నే ఎడ్వార్డ్ గ్యారేజ్ వద్దకు చేరుకుంది. తను ఆ ప్రాంతానికి నిప్పు పెట్టే ముందు ‘‘ఈరోజు మీరందరూ చచ్చిపోబోతున్నారు’’ అంటూ అరిచింది. ఆ సమయానికి ఎడ్వార్డ్ తన ఇంట్లో నిద్రపోతున్నాడు. తనతో పాటే ఉన్న తన ఫ్రెండ్.. తనను కాపాడడానికి ప్రయత్నించినా.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కేవలం ఎడ్వార్డ్‌పై కోపంతోనే ఆలియా ఇలా చేసిందని విచారణలో తేలింది. దీంతో తనపై తగిన కేసులు పెట్టి పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు.
తల్లి నమ్మకం
ఆలియా ఫఖ్రీపై ఈ కేసులు నిజమే అని ప్రూవ్ అయితే తను జీవితాంతం జైలులో ఉండే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆలియా తల్లి మాత్రం తన కూతురు ఇలాంటి పని చేసిందంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. తన కూతురు ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలనే చూసేదని అన్నారు. కొన్నాళ్ల క్రితం తనకు వచ్చిన అనారోగ్య సమస్యకు మెడిసిన్స్ ఉపయోగించిందని, దానివల్లే తను అలా మారిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మామూలుగా ఆలియా ఫఖ్రీ అంటే ప్రజలకు అంతగా తెలియకపోవచ్చు.. కానీ తను బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫఖ్రీ చెల్లెలు కావడంతో కాసేపట్లోనే ఈ వార్త ఇండియాలో కూడా ట్రెండింగ్‌గా మారింది.