BigTV English
Advertisement

Pushpa 2 In AP: పుష్ప-2 హిట్.. అంబటి ప్లాప్.. అరెరె టార్గెట్ మిస్ అయిందే!

Pushpa 2 In AP: పుష్ప-2 హిట్.. అంబటి ప్లాప్.. అరెరె టార్గెట్ మిస్ అయిందే!

Pushpa 2 In AP: పుష్ప – 2 సినిమా 5వ తేదీన విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కాగా, సినిమా యూనిట్ సంబరాలు జరుపుకున్నారు. ఇది ఇలా ఉంటే పుష్ప – 2 సినిమా పుణ్యమా అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు పెద్ద షాక్ తగిలింది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిందే అన్నట్లుగా అంబటి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఓ వైపు సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ వినిపిస్తుండగా, అంబటి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప – 2 భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మూడేళ్ల శ్రమకు నిదర్శనంగా ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే సినిమా పాటలు హిట్ కాగా, ప్రోమో కూడా భారీ వ్యూస్ సాధించింది. ప్రోమో చూసిన అల్లు అర్జున్ అభిమానులు, బాహుబలి రికార్డ్ ను తిరగరాయడం ఖాయమంటూ తెగ సంబర పడిపోయారు.

దేశ వ్యాప్తంగా ఈనెల 5వ తేదీన సినిమా విడుదల కానుండగా, ఏపీలో మాత్రం సినిమా గురించి పొలిటికల్ టాక్ సాగింది. మాజీ మంత్రి అంబటి సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయితే తాను కూడా చూసేందుకు సిద్దంగా ఉన్నానని, అల్లు అర్జున్ సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. సినిమాను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని, పుష్ప సినిమాను అయితే అస్సలు అడ్డుకోలేరంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అంబటి ఎందుకు చేశారో కానీ, మొత్తం మీద పుష్ప – 2 సినిమాకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరిగాయన్నది జోరుగా చర్చ సాగింది. అసలు సినిమాను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరు అడ్డుకుంటామని చెప్పారనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.


అయితే సినిమా 5న విడుదల కానుండగా, అల్లు అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద హల్చల్ చేస్తున్నారు. సినిమా టికెట్ మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న టాక్ కూడా సాగుతోంది. కాగా ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచాలని నిర్మాతలు అలా సంప్రదించారో లేదో ప్రభుత్వం ఓకే అనేసింది. డిప్యూటీ సీఎంగా గల పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారని, అందుకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కు అదే సినిమాను అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే, టికెట్ ధరల పెంపుకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

Also Read: Pushpa 2 Making Video: పుష్పగాడి రూల్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. మేకింగ్ వీడియోతోనే హైప్ ఎక్కిస్తున్న టీమ్

అంబటి రాంబాబు అనవసరంగా కామెంట్స్ చేసి, సినిమాకు రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేశారంటూ, పుష్ప నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిన విషయాన్ని అంబటి గుర్తించాలని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద పుష్ప పై అంబటి కామెంట్స్ ఏమో గానీ, విడుదలకు ముందుగానే సినిమా మాత్రం సూపర్ అనేస్తున్నారు అభిమానులు.

Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×