BigTV English

Allu Arjun : పాపం బన్నీ చెప్పుకుంటే పరువు పోయేలా ఉందే… ముందు గొయ్యి… వెనక నుయ్యి..

Allu Arjun : పాపం బన్నీ చెప్పుకుంటే పరువు పోయేలా ఉందే… ముందు గొయ్యి… వెనక నుయ్యి..

Allu Arjun : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ ఉన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమా గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీను ముందుగా ఆగస్టు 15 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6 న విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 పై ఉన్న క్రేజ్ ను మేకర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఒకరోజు ముందుగానే సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీని పై అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించలేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ ..

అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 న విడుదల కావాల్సింది. ఎందుకు ఆరో తారీకు అంటే 6 అనే నెంబరు అల్లు అర్జున్ కి చాలా ఫేవరెట్ నెంబర్. అందుకే ఆరో తారీకు రిలీజ్ డేట్ గా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు ఒకరోజు ముందుగా అనగా డిసెంబరు 5వ తారీఖున సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా వస్తుంది. అలాగే నాగచైతన్య సినిమా కూడా వస్తుంది. డిసెంబర్ 6 నుంచి చూస్తే అప్పుడు వరకు చాలా తక్కువ టైం ఉంది ఈ తక్కువ టైంలోనే అల్లు అర్జున్ చేయాల్సినంత చేయాలి సినిమా పరంగా కలెక్షన్స్ పరంగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇక ఆ తర్వాత సంక్రాంతికి కొత్త సినిమాలు ఉన్నాయి .. ఈ సినిమాపై ఫోకస్ తగ్గే ఛాన్స్ ఉండటంతో మేకర్స్ ముందుగానే రిలీజ్ చెయ్యనున్నారు .. దీని పై క్లారిటీ రావాల్సి ఉంది.


రామ్ చరణ్ వల్లే పుష్ప2ను ముందుగా రిలీజ్ చేస్తున్నారా …?

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ టైం లో పెద్ద సినిమాలు లేవు. చిన్న సినిమాలే విడుదల అవుతున్నాయి. ఇది పుష్ప 2 కు ప్లస్ అయ్యేలా కనిపేస్తూంది . ఇక ఈ మూవీ రిలీజ్ అయినా నెలలోపే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ విడుదల కాబోతుంది . ఆ సినిమా భారీ అంచనాల తో థియేటర్లలోకి వస్తుంది . అయితే పుష్ప 2 సినిమాకు ఓపెనింగ్స్ బాగుండాలంటే అనుకున్నదానికన్నా ఒకరోజు ముందుగా వస్తే బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఒకరోజు ముందు అయితే చాలు కొంతవరకైనా కలెక్షన్స్ పెరుగుతాయనే ఆలోచనలతో డిసెంబర్ 5 నే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. 6 అనేది లక్కీ నెంబర్. కానీ ఈసారి రామ్ చరణ్ పైన ఇలాగైనా గెలవాలనే ఒక ఆలోచన. అందుకే బన్నీ తన లక్కీ నెంబర్ ను పక్కన పెట్టి పుష్ప 2 ను రిలీజ్ చేస్తున్నారు.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా , ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు . మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×