BigTV English
Advertisement

Allu Arjun: అరెస్ట్ దెబ్బ.. బన్నీపై భారీ భారం.. ఎన్ని కోట్లంటే..?

Allu Arjun: అరెస్ట్ దెబ్బ.. బన్నీపై భారీ భారం.. ఎన్ని కోట్లంటే..?

Allu Arjun.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)నిన్న అనగా డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టయ్యారు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వరకు పాకిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోని అరెస్ట్ చేయడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విచారణ జరిపిన అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. అల్లు అర్జున్ న్యాయవాది బెయిల్ కావాలి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచికత్తు పైన హైకోర్టు ధర్మాసనం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ వచ్చిన సరే అల్లు అర్జున్ ను రాత్రంతా చంచల్గూడా జైల్లోనే ఉంచారు పోలీసులు. జైలు నుంచి ఈ రోజు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చారు.


నిన్న ఒక్కరోజే రూ.4కోట్లు ఖర్చు..

ఇకపోతే అల్లు అర్జున్ కు నిన్న ఒక్క రోజే రూ.3 నుంచి రూ.4 కోట్లు ఖర్చు అయిందట. అల్లు అర్జున్ తరఫున కోర్టులో కేసు వాదించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గంట కోసం పెద్ద మొత్తంలో తీసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఆయన సిబ్బంది దాదాపు 20 మందికి సపరేట్ ఖర్చు.అలాగే ఇతర ఖర్చలు అన్ని కలిపి నిన్న ఒక్క రోజే దాదాపు రూ.3 నుంచి రూ.4 కోట్లు ఖర్చు చేశాడని టాక్. అయితే ఒక్క రోజుకే అంత ఖర్చు పెట్టారు కానీ ఫైనల్ గా మధ్యంతర బెయిల్ పై వచ్చాడు. ఏది ఏమైనా నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ పైన వచ్చిన బన్నీకి మళ్లీ కోర్టు ఎలాంటి షాక్ ఇస్తుందో అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


బన్నీ అరెస్ట్ కి అసలు కారణం..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2. బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ఇది. ఎట్టకేలకు డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోలు వేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహిస్తూ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అందులో భాగంగానే తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే బన్నీపై కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా ర్యాలీతో రావడం వల్లే కేసు పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత అదే తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కొడుకు ప్రస్తుతం మృత్యువుతో పోరాడి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ కేసులో కూడా అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది. ఇకపోతే అల్లు అర్జున్ ని అరెస్టు చేయడంతో మృతురాలి భర్త భాస్కర్ తాను అల్లు అర్జున్ పై పెట్టిన కేసును వెనక్కు తీసుకుంటానని, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కోసం తాను కేసు ఫైల్ చేయించలేదని కూడా తెలిపారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×