Allu Arjun: టాలీవుడ్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయా? చిత్ర పరిశ్రమ ఇప్పుడు నాలుగు గ్రూపులుగా ముక్కలయ్యిందా? నటులపై కేసులు నమోదు వ్యవహారం కొత్త రచ్చకు దారి తీసిందా? అంతర్గత వ్యవహారాల్లో చిక్కుకుని కొందరు విలవిలలాడుతున్నారా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.
అల్లుఅర్జున్ అరెస్ట్ అనేక అంశాలను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గ్రూపుల రాజ్యం ఏలుతోందని ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు ఓపెన్‌గా చెబుతున్నారు. ఒకప్పుడు దాసరి నారాయణరావు హయాంలో ఏ సమస్య వచ్చినా అందరు కలిసి పరిష్కరించుకునేవారని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేశారు. ఆ సమస్యకు పరిష్కారం లభించేది. ఇదంతా గతం. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. దాని ఫలితంగా టాలీవుడ్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.
తెలంగాణ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ ఇలా గ్రూపులుగా విడిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వక్తు వ్యాపారం. అంతర్గతంగా ఇండస్ట్రీలో వారు చేసుకున్నదానికి కావాలనే కొందరు.. ప్రభుత్వంపై బురద జల్లడాన్ని తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీలో గ్రూపుల మధ్యే కాదు.. వ్యక్తుల మధ్య కూడా గ్యాప్ బాగా పెరిగిందనేది వాస్తవం.
ఎవరేమనుకున్నా, ఈ విషయంలో అంగీకరించక తప్పదు. ఇక బన్నీ అరెస్ట్ విషయమే చూద్దాం. అరెస్ట్ తప్పు అని ఓ ఒక్కరూ నోరు మెదపలేదు. చేసిన తప్పు క్లియర్‌గా కళ్లకు కనిపిస్తోంది. స్టార్ హీరోలు పెద్దగా రియాక్ట్ కాలేదు. దీనికి రాజకీయ రంగు అంటించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. నటీనటులకు వ్యక్తిగతంగా పార్టీలన్నా ఇష్టవున్నవారు ఉంటారు. నాయకులతో ఫ్రెండ్ షిప్ చేసినవారు లేకపోలేదు.
ALSO READ: మోహన్ బాబు ఇంకా పరారీ లోనే ఉన్నారా.?
ఇక అసలు విషయానికొద్దాం. జానీ మాస్టర్ జైలుకి వెళ్లడం వెనుక కొందరి హీరోల ప్రమేయముందనే టాక్ ఆ మధ్య జోరుగా సాగింది. జాతీయ అవార్డు తనకు మాత్రమే ఉండాలని భావించి ఆ హీరో.. తన టీమ్‌తో కలిసి కుట్ర పన్నినట్టు వార్తలు లేకపోలేదు. ఆయనకు మధ్యంతర బెయిల్ న్యాయస్థానం ఇవ్వడంతో, వెంటనే జానీ మాస్టార్‌కు ఇచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు లేఖలు రాశారట.
తొక్కిసలాట కేసులో నిందితుడు అల్లు అర్జున్ కావడంతో ఆయన కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. మేమే స్టార్లమంటూ కొందరు అతి చేశారని, అందుకు కాలమే సమాధానం చెప్పిందని అంటున్నారు. అయినా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసే సినిమాకు ఎవరైనా నేషనల్ అవార్డు ఇస్తారా అంటూ కొందరు రాజకీయ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపు తిరుగుతాయో చూడాలి.