E-Paper
Advertisement

Allu Arjun : పుష్పరాజ్ అనేది రియల్ సామి.. రీల్లో కూడా ఇలాగే ఉంటారా?

Allu Arjun : పుష్పరాజ్ అనేది రియల్ సామి.. రీల్లో కూడా ఇలాగే ఉంటారా?

AAllu Arjun : ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 న దీపావళి పండుగ.. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు అందరు టపాసులు కాల్చుతు సంబరాలు చేసుకున్నారు. సెలెబ్రేటీలకు సంబందించిన దీపావళి పండుగ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసి సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈసారి ఎవరికి వారే అన్నట్లు తమ ఇళ్లల్లో సంబరాలు చేసుకున్నారు. అల్లు అర్జున్ ( Allu Arjun ) తన ఫ్యామిలీ తో దీపావళి జరుపుకున్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఫ్యాన్ మేడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో దీపావళి సెలెబ్రేషన్స్ ను అల్లు అర్జున్ ఫ్యామిలీ తో జరుపుకుంటున్నాడు అల్లు అర్జున్. దానికి ఫ్యాన్స్ కింద పుష్ప 2 ( Pushpa2 ) వీడియో క్లిప్ ను యాడ్ చేశారు. దానిపైన రియల్ లైఫ్ అని దీపావళికి టపాసులు కాలుస్తున్న అల్లు అర్జున్ వీడియోను పెట్టగా, కింద పుష్ప 2 లోని పులితో ఉన్న వీడియోను పెట్టారు. రియల్ రీల్ అంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కొందరు యాంటి ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తన భార్య స్నేహతో, ఫ్యామిలీతో ప్రతి పండుగను సంబరంగా జరుపుకుంటారు అల్లు అర్జున్.. గతంలో అల్లు అర్జున్ కు సంబందించిన ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చాయి.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వచ్చి సంచలన విజయం సాధించిన పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పుష్ప‌రాజ్ సినిమా పై మరింత బజ్ క్రియేట్ చేయడానికి అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు దేశ వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. దాదాపు రూ. 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ప్రమోషన్స్ చెయ్యనున్నారు. ఇక ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఆ పాటలు మిలియన్ వ్యూస్ ను రాబట్టాయి.. సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సీక్వెల్ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×