BigTV English

OTT Movie : స్టూడెంట్ పై మనసు పడే టీచర్… అతని గురించి ఆ నిజం తెలిసి షాక్

OTT Movie : స్టూడెంట్ పై మనసు పడే టీచర్… అతని గురించి ఆ నిజం తెలిసి షాక్

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ కు యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు. ఈ మూవీస్ కు థియేటర్లలో అయినా ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్న ఒక హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “క్రష్” (Crush) 40 సంవత్సరాలు దాటిన ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా డేటింగ్ పేరుతో కాలం గడుపుతూ ఉంటారు. వారి ముగ్గురు మధ్య స్టోరీ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కేట్ నలభై సంవత్సరాలు దాటినా పెళ్లిచేసుకోకుండా స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. కేట్ తోపాటు మరో ఇద్దరు ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. జానన్ పోలీస్ ఆఫీసర్ గా, మోలి డాక్టర్ గా పనిచేస్తుంటారు. వీరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు వీళ్ళు వీరి డేటింగ్ ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా జానన్, మోలీ లైఫ్ లోకి వచ్చి వెళ్లిపోయిన బాయ్ ఫ్రెండ్స్ యూస్ లెస్ అంటూ మాట్లాడుకుంటారు. కేట్ కి మాత్రం ఇంతవరకూ బాయ్ ఫ్రెండ్ ఉండడు. ఒకరోజు చర్చిలో కేట్ ఉండగా అక్కడ ఆర్గానిస్ట్ ప్లే చేస్తున్న ఒక కుర్రాన్ని చూస్తుంది. అతను ఎవరో కాదు కేట్ పాత స్టూడెంట్. ఆ తర్వాత ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని ఇష్టపడతారు. ఆరోజు ఏకాంతంగా కూడా గడుపుతారు. ఈ విషయం కేట్ ఫ్రెండ్స్ కి తెలిసి అతను ఎలాంటి వాడో  తెలియకుండా నువ్వు ఎక్కువ దూరం వెళ్తున్నావు అని చెప్తారు. ఆమె వాళ్ళ మాటలను పట్టించుకోదు. అతని బయోడేటా చెక్ చేయగా అతని మీద కొన్ని కేసులు ఉంటాయి. ఈ విషయం కేట్ ఫ్రెండ్స్ ఆమెకు చెప్పగా, కేట్ అతని మీద కోప్పడుతుంది. ఈ విషయాలన్నీ ఎందుకు నా దగ్గర దాచావు అని అంటుంది. అయినా కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ మత్తులో మునిగిపోయి ఉంటుంది.

ఇక చేసేదేం లేక కేట్ ఫ్రెండ్స్ ఒక పారిస్ ట్రిప్ కి తీసుకెళ్తారు. అక్కడ ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తారు. అక్కడ ఉన్నా కూడా కేట్ కి బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తూ ఉండటంతో వారికి చెప్పకుండా లండన్ వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే వీరిని విడగొట్టాలిని కేట్ ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు. కేట్ ఫ్రెండ్స్ అతడిని ఏకాంతంగా గడపమని రెచ్చగొడతారు అందుకు అతను ఒప్పుకోడు. అయినా సరే అతని మీద చేయి వేస్తూ మాట్లాడుతుండగా ఆ దృశ్యాన్ని కేట్ చూస్తుంది. అతని మీద కోప్పడుతూ వెళ్ళిపోతుంది. వెంటనే ఆమెను వెతుక్కుంటూ బాయ్ ఫ్రెండ్ వెళ్ళగా దారి మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది. చివరికి బాయ్ ఫ్రెండ్ ఆక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడా? కేట్ తన ప్రేమను నిలుపుకోగలిగిందా? కేట్ ఫ్రెండ్స్ నుంచి ఆమెకు కలిగిన ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ  బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో క్లైమాక్స్ మిస్ అవ్వకండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×