BigTV English

Allu Arjun: సక్సెస్ వల్లే అలా జరుగుతుంది, నేను చాలా సాధారణ మనిషిని.. బన్నీ కామెంట్స్

Allu Arjun: సక్సెస్ వల్లే అలా జరుగుతుంది, నేను చాలా సాధారణ మనిషిని.. బన్నీ కామెంట్స్

Allu Arjun: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒకప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా హీరోగానే తన డెబ్యూ చేశాడు. అల్లు వారసుడు అయినా కూడా తనను అందరూ మెగా హీరోగానే గుర్తుపట్టేవారు. కానీ మెల్లగా తనకు స్టార్‌డమ్ పెరుగుతున్నాకొద్దీ మెగా హీరోలను దూరం పెట్టాడని, ఆఖరికి ఇంటిపెద్ద అయిన చిరంజీవిని కూడా అవమానించాడని కొందరు అభిమానులు తనపై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అలా గత కొన్నేళ్లలో బన్నీపై నెగిటివిటీ చాలా పెరిగిపోయింది. అయినా కూడా అంచలంచలుగా ఎదుగుతూ ఏకంగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగాడు అల్లు అర్జున్.


వైరల్ కబుర్లు

‘పుష్ప 2’ విడుదల వల్ల అల్లు అర్జున్ కెరీర్ మరో మలుపు తిరిగింది. కేవలం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లో కూడా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆఖరికి ఫారిన్ ప్రేక్షకులు సైతం పుష్పగాడి యాటిట్యూడ్‌కు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇదే సమయంలో ఈ సినిమా వల్ల, దానివల్ల జరిగిన సంఘటనల వల్ల అల్లు అర్జున్‌ (Allu Arjun)పై నెగిటివిటీ వచ్చినా అది తనకు పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా బన్నీని ఇంటర్వ్యూ చేయడానికి ఒక హాలీవుడ్ ఫేమస్ మ్యాగజిన్ ముందుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వినయంగా మారాను

తాజాగా తన కెరీర్ మలుపు తిరగడానికి ‘పుష్ప 2’నే కారణమంటూ మొత్తం క్రెడిట్ అదే సినిమాకు ఇచ్చేశాడు అల్లు అర్జున్. ‘‘పుష్ప 2 (Pushpa 2) అనేది నా జీవితంలోనే అతిపెద్ద అవకాశం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఒక నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అది’’ అని చెప్పుకొచ్చాడు బన్నీ. అంతే కాకుండా సక్సెస్ గురించి తన స్టైల్‌లో అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘సక్సెస్‌తో ఎంతో వినయం కూడా వస్తుంది. చాలామంది సక్సెస్ తర్వాత చాలా వినయంగా మారడం నేను స్వయంగా చూశాను. ఇది రెండు విధాలుగా ఉంటుంది. సక్సెస్‌ను ఎలా తీసుకోవాలి అనేది ఒక మనిషిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని తెలిపాడు అల్లు అర్జున్.

Also Read: ఏమీ చేయకపోవడమే ఇష్టం.. ఇదేమి అలవాటు బన్నీ? షాకవుతున్న ఫ్యాన్స్

సాధారణ మనిషిని

ఆన్ స్క్రీన్ బన్నీ అప్పీయరెన్స్ అనేది చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. దానిగురించి తను మాట్లాడుతూ.. ‘‘అది ఒక మనిషి మైండ్‌లో ఉంటుంది. దానిని తన నుండి ఎవరూ తీసుకోలేరు. అది మనిషి వ్యక్తిత్వంలో ఉంటుంది’’ అని తెలిపాడు. తను షూటింగ్ లేనప్పుడు చాలా ఖాళీగా ఉంటానని చెప్తూ.. తను చాలా సాధారణ మనిషిని అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అసలు స్పాట్‌లైట్‌లో లేనప్పుడు అందరి లాగానే సింపుల్ జీవనాన్ని కొనసాగిస్తానని తెలిపాడు. మొత్తానికి అల్లు అర్జున్ కెరీర్ ‘పుష్ఫ 2’తో మరో మలుపు తిరిగిందని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×