BigTV English
Advertisement

Allu Arjun: డబ్బింగ్ స్టార్ట్ చేసిన బన్నీ.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

Allu Arjun: డబ్బింగ్ స్టార్ట్ చేసిన బన్నీ.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అల్లు అర్జున్ – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా నార్త్ ఆడియన్స్ లో ఒక ఊపు తీసుకొచ్చింది. అంతేకాదు అల్లు అర్జున్ కి ‘నేషనల్ అవార్డు’ కూడా అందించింది. ఈ సినిమా తర్వాత సీక్వెల్ పై అంచనాలు భారీగా పెంచేశారు మేకర్స్.. అందులో భాగంగానే మూడేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించి, ‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడమే కాదు రూ.2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి అతి చేరువలో ఉంది. ఇదే గనుక నిజమైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటుంది. మరోవైపు ఇప్పట్లో ఈ టార్గెట్ ను బ్రేక్ చేయడం అంత సులభమేమీ కాదు అని కూడా ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.


డబ్బింగ్ స్టార్ట్ చేసిన బన్నీ..

ఇదిలా ఉండగా ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఆ సినిమాల షూటింగ్ మొదలు పెట్టలేదు. కానీ అప్పుడే బన్నీ డబ్బింగ్ ఇస్తున్నాడు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. దీంతో పుష్ప 2 విడుదలై రికార్డులు కొల్లగొడుతుంటే.. ఇప్పుడు డబ్బింగ్ ఏంటి? అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పుష్ప 2 లో కట్ చేసిన సీన్లకు బన్నీ డబ్బింగ్..

పుష్ప 2 సినిమా విడుదలైన తరువాత ఆ సినిమా సక్సెస్ ను బన్నీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కారణం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన అరెస్టు అవ్వడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఎంత చర్చనీయాంశం గా మారాయో అందరికీ తెలుసు. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ లాగా మారిపోవడంతో అటు బన్నీ మాత్రమే కాదు..ఇటు ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడింది. దాంతో పుష్ప 2 పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు, సక్సెస్ మీట్ లు కూడా అనుకున్నట్లు చేయలేకపోయారు. ప్రస్తుతం జరిగిన పరిణామాల కారణంగా బన్నీ కూడా ఇంటికే పరిమితమయ్యారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ చెప్పడానికి వచ్చారట. పుష్ప 2 సినిమా కోసమే బన్నీ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే, “ఈ సినిమా నిడివి పెరగడం వల్ల ఎడిటింగ్ లో కొన్ని సీన్ లను కట్ చేశారు. వాటి వల్ల కథ కంటిన్యూటీ కూడా దెబ్బతినింది. జపాన్లో బన్నీ ఇంట్రడక్షన్ ఫైట్ తర్వాత సన్నివేశం అభ్యంతరంగా ముగిసిపోవడంతో.. ఇది ఎందుకు పెట్టారు? అని ప్రేక్షకులు కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు హీరో జపాన్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ గన్ షాట్ తర్వాత ఏమైంది? తిరిగి ఇండియాకు ఎలా వచ్చాడు ?ఇలా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అందుకే లింకు మిస్ అయిన సీన్లు ఎడిటింగ్ లో కట్ చేయడంతో వాటిని ఇప్పుడు కలపడానికి మళ్లీ ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో యాడ్ కావాల్సింది కానీ డబ్బింగ్ చెప్పడానికి బన్నీ అందుబాటులో లేకపోవడం వల్లే లేట్ అయింది. అందుకోసమే బన్నీ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. తెలుగు డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత మిగతా భాషల డబ్బింగ్ కూడా పూర్తి చేసి.. కొత్త సీన్లను కలిపిన తర్వాత జనవరి 1 నుంచి థియేటర్లలో కాకుండా ఓటీటీలో అందుబాటులోకి సిద్ధం తీసుకురానున్నట్లు సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×