Allu Arjun About Sri Tej: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా ఒకరి ప్రాణం తీసింది. శ్రీతేజ్ అనే బాలుడు తన కుటుండంతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ను చూడడానికి వచ్చాడు. అక్కడికి అల్లు అర్జున్ కూడా మూవీ టీమ్‌తో కలిసి ఆ సినిమాను చూడడానికి వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా తనను చూడడానికి ఎగబడ్డారు. ఆ తొక్కిసలాటలో శ్రీ తేజ్ తల్లి మరణించగా.. బాలుడు మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా కోమాలో ఉన్నాడు. ఆసుపత్రిలో ఉన్న బాలుడి గురించి చెప్తూ అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేయగా.. అందులో తను అన్నీ అబద్ధాలు చెప్పినట్టు తెలుస్తోంది.
మాటిచ్చిన హీరో
సంధ్య థియేటర్‌లో ‘పుష్ఫ 2’ ప్రీమియర్‌కు అల్లు అర్జున్ (Allu Arjun) రాగా ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్‌కు ఊపిరి ఆడలేదు. వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యి తనకు సీపీఆర్ చేశారు. కానీ సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో అప్పటికే శ్రీ తేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. అలా దాదాపు రెండు వారాల నుండి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ్ చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అవ్వడంతో తాను స్వయంగా వెళ్లి చూడలేనంటూ ఒక వీడియో విడుదల చేశాడు. అంతే కాకుండా ఆ బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా తాను పెట్టుకుంటానని మాటిచ్చాడు. కానీ అక్కడ అసలు విషయం వేరే ఉన్నట్టు అనిపిస్తోంది.
Also Read: అన్నలు బంధుత్వాన్ని కలుపుకున్నారు.. తమ్ముడి ఛాన్స్ ఇవ్వరా..
ప్రభుత్వానిదే బాధ్యత
శ్రీ తేజ్ (Sri Tej) ఆసుపత్రి అడ్మిట్ అయ్యి దాదాపు 12 రోజులు అవుతున్నా ఇప్పటివరకు తనను చూడడానికి బయట వ్యక్తులు ఎక్కువగా రాలేదు. అందుకే తన ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కోసం కమీషనర్ సీపీ ఆనంద్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీ తేజ్‌ను చూసి తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను కనుక్కున్నారు. ఆ తర్వాత ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో శ్రీ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి త్వరలోనే బులిటెన్ విడుదల చేస్తామని, తను కోలుకునే వరకు ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మరి ఖర్చు గురించి అల్లు అర్జున్ చెప్పిన మాటలు అబద్ధమేనా అని అందరిలో సందేహం మొదలయ్యింది.
ఏది నిజం.?
అల్లు అర్జున్ ఏమో తాను విడుదల చేసిన వీడియోలు శ్రీ తేజ్ ఆసుపత్రి ఖర్చులు అన్నీ తను, తన టీమే భర్తిస్తుందని చెప్పాడు. అంతే కాకుండా శ్రీ తేజ్‌కు ఫారిన్ నుండి లక్షలు ఖరీదు చేసే ఇంజెక్షన్ కూడా తెప్పించాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సీపీ ఆనంద్ ఓపెన్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్ అయితే అబద్ధం అయ్యిండదు కదా.. మరి అల్లు అర్జున్ అలా చెప్పిన తర్వాత కూడా ఆసుపత్రి ఖర్చుల గురించి ఆలోచించడం లేదా అని అనుమానాలు వినిపిస్తున్నాయి.