Case on Allu Arjun Fans: ప్రజా ప్రభుత్వంలో చట్టం ఎవరికైనా చట్టమే. సెలబ్రిటీలకు ఒక లెక్క సామాన్యులకు ఒక లెక్క అన్న తేడాలు చూపడం అసలే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందే.. తప్ప దాన్ని ట్యాంపర్ చేయడం జరగదు. చట్టం ఇక్కడ ఎవరికైనా చట్టమే. ఏ ఒక్కరికీ చుట్టంగా పరిగణించే పరిస్థితి లేదు. ఇది అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా.. ఇటు జనం, అటు పోలీసులు ముక్త కంఠంతో అంటోన్న మాట. ఎలాంటి మొహమాటాలకు పోకుండా.. చట్టం ఎవరికైనా చట్టమే అన్న కోణంలో తన ప్రజా ప్రభుత్వ పంథా ఏమిటో తెలియ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల ఆయన వెనకనుండి ఇదంతా చేశారని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
ఇక ఇదే విషయంపై దొరికిందే ఛాన్స్ అన్నట్టు అల్లు అర్జున్ అరెస్ట్‌పై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు రియాక్ట్ అయ్యారు. నేషనల్ అవార్డ్ అందుకున్న స్టార్‌ని అరెస్ట్ చేయడం.. పాలకుల అభద్రతా భావానికి పరాకాష్ఠ అన్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ని.. ఓ సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాట బాధితులపై తనకు సానుభూతి ఉందంటూనే.. ఈ విషయంలో నిజంగా ఫెయిలైంది ఎవరని ప్రశ్నించారని, చిట్టి నాయుడు ఈగో హర్ట్ అవడం వల్లే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటెన్‌ను కిమ్స్ ఆసుపత్రి వెల్లడించింది. తొక్కిసలాట తర్వాత పోలీసులు సీపీఆర్ చేశారని.. సీపీఆర్ చేసినప్పటికీ శ్రీతేజ్ బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందలేదని వైద్యులు చెబుతున్నారు. పక్కటెముకలు దెబ్బతినడం వల్ల శ్రీతేజ్ ఆహారం తీసుకోవట్లేదని ..పైప్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఆహారం అందిస్తున్నామని హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ మహిళా నేతలు, మందకృష్ణ మాదిగ శ్రీతేజ్‌ని చూసేందుకు వెళ్లారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read: ప్రధాని మోదీ వైఖరిపై నిరసన.. రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్‌రెడ్డి
సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. తాజాగా… బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే అల్లు అర్జున్‌కు హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో.. నేరుగా సుప్రీంకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించారు.
దీనిపై అల్లు అర్జున్ ఫాన్స్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టినవారిపై హైదరాబాద్, సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై 4 కేసులు నమోదు చేశారు. నిందితులపై ఐటి యాక్ట్ తో పాటు.. BNS 352, 353 ఆఫ్ 1B సెక్షన్లు పెట్టారు.