Allu Arjun – Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఆమె మృతికి అల్లు అర్జున్ కారణం అని పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు గత శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆయన హైకోర్టు లో ఈ కేసు పై ఫిటిషన్ వేశారు. కేసును కొట్టేయ్యాలని అభ్యర్థన చేశారు. దానిపై విచారణ జరిపి ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి అండగా నిలబడింది. చిరంజీవి, నాగబాబు లు అల్లు అర్జున్ బయటకు వచ్చేంతవరకు శ్రమ పడ్డారని తెలిసిందే. వాళ్లను అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా కలవలేదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఎందుకు పవన్ కలవలేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మెగా vs అల్లు గొడవలకు చెక్..
పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. మహిళ మృతిచెందిన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రాత్రి జైలులో ఉన్న తర్వాత అల్లు అర్జున్‌కు బెయిల్ లభించింది. దీంతో జైలుకు వెళ్లొచ్చాడని చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు అల్లు అర్జున్‌ను కలవడానికి క్యూ కట్టారు.. ఇండస్ట్రీలోని అందరు హీరోలు బన్నీని నేరుగా ఇంటికి వెళ్లే పరామర్శించారు. మెగా హీరోలు మాత్రం రాకపోవడంతో మరుసటి రోజు అల్లు అర్జునే వెళ్లి చిరంజీవి, నాగబాబును కలిశారు. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు ఉన్న మనస్పర్థలు తొలగిపోయినట్టే అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తుంది.. అసలేమైంది పవన్ కు ఇంకా అదే మనసులో పెట్టుకున్నారా? లేదా బాబాయ్ అన్నందుకు హర్ట్ అయ్యారా? లాంటి ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
కళ్యాణ్ బాబు మనసు ఎందుకు కఠినం..?
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు. తన అరెస్టుతో ఆ పోస్ట్‌కు సంబంధం లేకపోయినా.. ప్రేక్షకులు మాత్రం ఇది ఇన్‌డైరెక్ట్ రెస్పాన్స్ లాగా అనిపిస్తుందని అనుకున్నారు. ఆరోజు వెంటనే హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో కూడా వచ్చారు పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ ను విడిపించడానికి వచ్చారని అందరు అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. హైదరాబాద్‌కు వచ్చిన పవన్ వెంటనే తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆయన అల్లు అర్జున్‌ను కలవడానికి ఇష్టపడడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక అల్లు అర్జునే స్వయంగా తనను కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో సార్లు కలవాలని ప్రయత్నించిన రెస్పాండ్ అవ్వలేదని సమాచారం. అయితే డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడా, లేదా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల అయినా కలవడానికి ఇష్టపడడం లేదా అనేది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా వీరిద్దరి కలయికతోనే గొడవలకు పులుస్టాప్ పడుతుంది.. చూద్దాం పవన్ కళ్యాణ్ మనసు కరుగుతుందేమో..