BigTV English

Allu Arjun – Neel: త్రివిక్రమ్‌ను సైడ్ చేసిన బన్నీ.. ఆ పాన్ ఇండియా డైరెక్టర్‌‌కు ఛాన్స్?

Allu Arjun – Neel: త్రివిక్రమ్‌ను సైడ్ చేసిన బన్నీ.. ఆ పాన్ ఇండియా డైరెక్టర్‌‌కు ఛాన్స్?

Allu Arjun – Neel: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఇటీవల పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు..అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలుగా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో అల్లు అర్జున్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి . ఇలా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో సినిమా చేయబోతున్నారని గతంలో ప్రకటించారు అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందని అందుకే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో(Atlee) సినిమాకు కమిట్ అయ్యారని ప్రకటించారు. ఇక ఈ సినిమా రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని సమాచారం.

గురూజీని పక్కన పెట్టేశారా…


ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఈ సినిమా పూర్తి అయిన తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అల్లు అర్జున్ పూర్తిగా పక్కన పెట్టేసారని తెలుస్తుంది. అట్లీ సినిమా తర్వాత బన్నీ మరొక పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ కు కమిట్ అయ్యారని తెలుస్తోంది.. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో అల్లు అర్జున్ మరో సినిమాకు కమిట్ అయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు (Dil Raju) వ్యవహరించబోతున్నట్టు సమాచారం.

దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో…

ఇలా దిల్ రాజు నిర్మాణ సంస్థలో ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ సినిమా అంటేనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టుకు మరింత సమయం పడుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2, కే జి ఎఫ్ 3 వంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్, ప్రశాంత్ సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో చేయాలనుకున్న సినిమాని రామ్ చరణ్ తో చేయబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×