BigTV English
Advertisement

Allu Arjun: బన్నీలో క్రూరత్వం చూడాలా…? వెయిట్ చేయండి అట్లీ ప్లాన్ చేస్తుండు

Allu Arjun: బన్నీలో క్రూరత్వం చూడాలా…? వెయిట్ చేయండి అట్లీ ప్లాన్ చేస్తుండు

Allu Arjun: అల్లు అర్జున్ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్. ‘పుష్ప 2’ తో భారీ హిట్ కొట్టిన బన్నీ, తన మార్కెట్ రేంజ్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. ఈ సక్సెస్‌ను మరో పెద్ద ప్రాజెక్ట్‌తో కొనసాగించాలనే ఉద్దేశంతో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.


ఇప్పటికే అట్లీ, అల్లు అర్జున్ కలిసి దుబాయ్ లో స్టోరీ సిట్టింగ్స్ జరిపినట్టు టాక్. అసలు విశేషం ఏంటంటే, అట్లీ తొలుత సల్మాన్ ఖాన్ కోసం ఓ కథ రెడీ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అదే కథను కొన్ని మార్పులు చేసి బన్నీ కోసం మోడిఫై చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్. ఇది మరింత ఆసక్తికరంగా మారడానికి కారణం, ఇందులోని ఒక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయి!

అల్లు అర్జున్ ఇప్పటివరకూ స్టైలిష్ డ్యాన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ అవతారం తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కానీ అట్లీ తనను మరో లెవల్‌లో ప్రెజెంట్ చేయనున్నాడని సమాచారం. ఇప్పటివరకు ఎవరు ఊహించని విధంగా బన్నీని ఇంటెన్స్ నెగటివ్ షేడ్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు.


బన్నీ ఒకే సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కానీ ఒక క్యారెక్టర్ పూర్తిగా నెగటివ్ షేడ్ లో ఉండడం చాలా అరుదైన విషయం. గతంలో కొన్ని సినిమాల్లో హీరోలు విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా, అవి అంతగా హైలైట్ కాలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ ట్రీట్‌మెంట్ తో విలన్ రోల్ కి కొత్త డెఫినిషన్ ఇవ్వనున్నాడు.

అట్లీ సినిమాలు చూస్తే, ఆయన హీరోల్ని విస్మయపరిచే విధంగా డిజైన్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో విజయ్‌తో ‘థెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ లాంటి హిట్లు అందుకున్న అట్లీ, షారుఖ్ ఖాన్ తో చేసిన ‘జవాన్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ను కూడా అదే స్థాయిలో ప్రెజెంట్ చేయడానికి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.

ఈ కథలో ఒక పాత్ర పూర్తి మాస్, మరో పాత్ర నెగటివ్ షేడ్‌తో ఉండబోతుందని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, అల్లు అర్జున్ విలన్ క్యారెక్టర్ లోకి మారి సరికొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. అల్లు అర్జున్ సినిమా సెలక్షన్‌లో చాలా కేర్ తీసుకునే స్టార్. ‘పుష్ప 2’ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్‌లో తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే, అట్లీ లాంటి కమర్షియల్ మాస్టర్ తో కలసి పని చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో హైప్ పెరిగిపోయింది.

ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా, బన్నీ – అట్లీ కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీస్ పై భారీ ప్రభావం చూపించనుందని అంతా నమ్ముతున్నారు. మరి, బన్నీ విలన్ అవతారం ఎలా ఉంటుందో?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×