E-Paper
Advertisement

Mango Rice: పచ్చి మామిడి కాయ రైస్ ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది, పైగా ఆరోగ్యం కూడా!

Mango Rice: పచ్చి మామిడి కాయ రైస్ ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది, పైగా ఆరోగ్యం కూడా!
Advertisement

వేసవిలో మామిడికాయలు అధికంగా వస్తాయి. ఇవి సీజనల్ గా దొరికేవి. కాబట్టి ఆ సీజన్లో వచ్చేవి… ఆ కాలంలో తినాల్సిందే. అందుకే పచ్చి మామిడికాయ రెసిపీలను కచ్చితంగా అందరూ తినాలి. ఇక్కడ మేముపచ్చి మామిడికాయతో పుల్లని రెసిపీ ఎలా చేయాలో చెప్పాము. ఈ పచ్చి మామిడికాయ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగపడుతుంది.

పచ్చిమామిడి రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమామిడికాయ – ఒకటి
వండిన అన్నం – రెండు కప్పులు
నూనె – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు -రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు స్పూను
పల్లీలు – గుప్పెడు
కారం – అర స్పూను
జీలకర్ర – అరస్పూను
ఆవాలు – అర స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
శెనగపప్పు – ఒక స్పూను
పచ్చిమిర్చి – ఐదు

Advertisement

పచ్చిమామిడి రైస్ రెసిపీ

  • మామిడికాయ పైన తొక్కును తీసేసి దాన్ని తురుముకోవాలి.
  • ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
  • అందులో పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఆ నూనెలోనే జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి.
  • శెనగపప్పు, మినప్పప్పు కూడా వేసి వేయించుకోవాలి.
  • అప్పుడే నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు మామిడికాయ తురుమును వేసి బాగా కలపాలి.
  • రెండు నిమిషాల పాటు వేయించాలి. మామిడి తురుము పుల్లటి రుచి కాస్త తగ్గుతుంది.
  • ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • కొత్తిమీర తరుగును కూడా వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
  • వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేయాలి. అంతే టేస్టీ పచ్చి మామిడికాయ రైస్ రెడీ అయినట్టే.

ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర లాగే మామిడికాయ పులిహార కూడా అద్భుతంగా ఉంటుంది. పైగా పోషకాలు ఎక్కువ.

Advertisement

Also Read: తియ్యటి పుచ్చకాయ కావాలా? సింపుల్ గా ఇలా గుర్తుపట్టండి!

పచ్చి మామిడికాయలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది సీజనల్‌గా దొరికేవి. కాబట్టి ఆయా సీజన్లలో కచ్చితంగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి మామిడికాయని తినడం ద్వారా మనకు ఎన్నో ఖనిజాలు శరీరానికి చేరుతాయి. మామిడికాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ వంటివి నిండుగా ఉంటాయి. కాబట్టి మనల్ని పోషకాహార లాభం నుండి కాపాడతాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, పలీఫెనాల్స్ వంటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవే. మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి మామిడి కాయలు ఎంతో మేలు చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవడంలో పచ్చి మామిడికాయ ముందుంటుంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×