BigTV English

Allu Arjun: బాలీవుడ్ ను కూడా వదలని బన్నీ.. ఆ మాట అని వివాదం తెచ్చాడా.. ?

Allu Arjun: బాలీవుడ్ ను కూడా వదలని బన్నీ.. ఆ మాట అని వివాదం తెచ్చాడా.. ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు అంటే నిజమే అంటున్నారు అభిమానులు కూడా. అదేంటి.. ఈ ఏడాదే కదా బన్నీ జాతీయ అవార్డును అందుకున్నది అనే అనుమానం రావచ్చు. అది వచ్చాకనే బన్నీ వివాదాల్లో ఇరుక్కోవడం మొదలుపెట్టాడు. మొన్నటికి మొన్న జనసేనకు సపోర్ట్ గా నిలబడకుండా నంద్యాలకు వెళ్లి వైసీపీ నేతకు సపోర్ట్ గా నిలబడ్డాడు. అది సపోర్ట్ అని చెప్పలేం కానీ, ఒక ఫ్రెండ్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పొచ్చు.


ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం తప్పు కాదు కానీ, వెళ్లిన టైమ్ మాత్రం తప్పు. ఆ ఒక్కరోజు బన్నీ ఆ పని చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ని విమర్శలను పడాల్సిన అవసరమే ఉండేది కాదు. సొంతవాళ్లకు ద్రోహం చేసిన వ్యక్తిగా బన్నీ నిలబడ్డాడు. ఇక ఇదంతా గతం అనుకుంటే.. తాజాగా బన్నీ.. బాలీవుడ్ లో కూడా కొత్త పంచాయితీకి తెరలేపాడు.

తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ.. అల్లు అర్జున్ గురించి సెన్సషనల్ కామెంట్స్ చేశాడు. పుష్ప తరువాత బన్నీకి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్సే వచ్చాయి. ఆ లిస్ట్ లో నిఖిల్ అద్వానీ కూడా ఒకరు. ఇక అతనిని మంబైలో కలిసినప్పుడు బన్నీ ఒక మాట అన్నాడట. “నేను అల్లు అర్జున్ ను కలిశాను. మేము సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. అతను నన్ను చూసి.. బాలీవుడ్‌లో ఏమి జరుగుతుందో తెలుసా? మీరు హీరోలుగా ఎలా ఉండాలో మరిచిపోయారు. ఇది పురాణం కాదు. హిందీ సినిమాల్లో హీరోయిజం మిస్సవుతుంది” అని అన్నాడు.


నిజంగా బన్నీ అంత మాట అన్నాడా.. ? ఆ మాట వలన వివాదాలు వచ్చాయా .. ? అంటే నిజమే అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుత కాలంలో బాలీవుడ్ మొత్తం సౌత్ వైపే చూస్తోంది. ఇలాంటి సమయంలో వారిని తక్కువ చేసి మాట్లాడడం పద్దతి కాదని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి అల్లు అర్జున్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×