BigTV English

Good News For Telangana Unemployed: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన: మంత్రి పొంగులేటి

Good News For Telangana Unemployed: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన: మంత్రి పొంగులేటి

Good News For Telangana Unemployed Tomorrow Job Calender: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం జరిగిన క్యాబినేట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను పొంగులేటి మీడియాకు వివరించారు. ఇందులో భాగంగానే రేపు అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నట్లు తెలిపారు.


అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీలను అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.437 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి శ్రీధర్ బాబు అధ్యక్షతన క్యాబినేట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అలాగే క్రీడాకారులైన ఈషాసింగ్, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల విధుల్లోచనిపోయిన్ రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.


Also Read: బీఆర్ఎస్ పై బీజేపీ మండిపాటు.. ‘వారి వల్లే చాన్స్ మిస్ అయింది’

అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించుకున్నామని, కోదండరాంరెడ్డి, అమీర్ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపిస్తామన్నారు. ఇంకా నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ, హైదరాబాద్ లో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×