Bhanu Sri Mehra: సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు అభిమానులను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. ఇక నిన్నటికి నిన్న తబలా ఆర్టిస్ట్ గా భారీ పాపులారిటీ అందుకున్న జాకీర్ హుస్సేన్(Zakir Hussain) స్వర్గస్తులవగా ఇక నేడు అల్లు అర్జున్(Allu Arjun)బ్యూటీ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘వరుడు’ సినిమాతో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందచందాలతో ఆకట్టుకున్న ఈమె తాజాగా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.
భాను శ్రీ మెహ్రా ఇంట్లో విషాదం..
అసలు విషయంలోకెళితే.. భాను శ్రీ మెహ్రా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తమ్ముడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది భాను శ్రీ మెహ్రా. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తన సోదరుడితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.”నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడ కలలానే ఉంది. ఇదంతా నిజమని నేను ఎలా నమ్మాలి. నువ్వు లేకపోవడంతో కుటుంబంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ప్రతి చిన్న విషయంలో కూడా మాకు నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ మేము జీవితాంతం మోయాల్సిందేనా? నా మనసులో ఎప్పటికీ నీకు చోటు ఉంటుంది. ఐ లవ్ యు.. ఐ మిస్ యు నందు” అంటూ తన బాధను అంతా ఒక ఇన్ స్టా పోస్ట్ లో షేర్ చేసింది భాను శ్రీ. ప్రస్తుతం ఈ వీడియో చూసిన అభిమానులు కంటకడి పెట్టుకుంటున్నారు. అసలు నందు మరణానికి గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.
వైవాహిక బంధంలో సెటిల్ అయిన భాను శ్రీ..
ఇక భాను శ్రీ వ్యక్తిగత విషయానికొస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ (Karan Manas)అనే వ్యక్తిని వివాహం చేసుకొని, వైవాహిక జీవితంలో సెటిలైపోయింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన తమ్ముడు లేని విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">