SS Thaman – Game Changer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ (SS Thaman) ఒకరు. కిక్ (Kick) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. చాలా త్వరగా 50 సినిమాలను ఫినిష్ చేశాడు. అప్పట్లో ఏ సినిమా చూసిన తమన్ పేరు కనిపించేది. కొంతకాలం తర్వాత తమన్ స్లో అయిపోయాడు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ (Tholiprema) సినిమాతో మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు తమన్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తమన్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది.
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసిన ప్రతి సినిమాకి ఇప్పటివరకు తమన్ సంగీతం అందించాడు. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో రాబోతున్న ఓజి (OG ) సినిమా కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. తమన్ చేతిలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Also Read : Mohanlal As Kirata: ట్రోల్స్ కోసమే ఫస్ట్ లుక్స్
తమన్ చేస్తున్న మరో ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను రిలీజ్ చేశారు. ఈ మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి 4వ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సాంగ్ మీద విపరీతమైన అంచనాలను పెంచుతున్నాడు తమన్. ఈ పాట గురించి ఇప్పటికే దాదాపు నాలుగు ట్వీట్లు వేశాడు. దోప్ (Dhop Song) అనే ఈ సాంగ్ తోపు లెవెల్ లో ఉంటుంది అని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక థర్డ్ సింగిల్ మెలోడీ మంచి ఫీల్ ని క్రియేట్ చేసింది. ఇంక రాబోయే సాంగ్ దానిని మించి ఉంటుంది అనగానే అందరికీ ఎప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ మొదలైంది.
Also Read : Game Changer : గేమ్ ఛేంజ్ అవ్వడం లేదు… చరణ్‌కు చరణమే మైనస్..?
#DHOP THE WORLD WILL 🌍 TALK ABOUT IT ▶️
— thaman S (@MusicThaman) December 16, 2024