Allu Arjun:తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహ రెడ్డి(Sneha Reddy) ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)బాటలో నడవబోతుందని సమాచారం. అసలు విషయంలోకెళితే ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో గొడ్డు మాంసం కలిసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. దాదాపు 11 రోజులపాటు ఈ దీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ తిరుమలకు నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనం చేసుకున్నారు. అంతేకాదు అక్కడ స్వామివారి మెట్లను తన స్వహస్తాలతో శుభ్రం చేసి చర్చనీయాంశంగా మారారు.
41 రోజులపాటు దీక్ష చేయనున్న స్నేహ రెడ్డి..
అయితే ఇప్పుడు ఆయన బాటలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఏకంగా 41రోజులపాటు దీక్ష చేయబోతున్నట్లు సమాచారం. కేవలం పండ్లు తిని, 41 రోజులు ఉపవాసం చేయబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో తన భర్త కోసం ఉపవాసాలు, ధనుర్మాస పారాయణం కూడా చేయబోతుందట. ఒకవైపు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శత నామావళిని ప్రతిరోజూ చదవాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ తర్వాత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ భర్త కోసమే ఆమె ఇవన్నీ చేస్తున్నట్లు సమాచారం..
అయితే సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా కారణం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar)కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’. డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో వేశారు. సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేయగా అక్కడికి ర్యాలీతో వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో ఆయనపై కేసు ఫైల్ అయింది. అంతేకాదు మరొకవైపు ఆ సంఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీ తేజ కి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని తాజాగా వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఆ బాలుడు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
భర్తను గట్టెక్కించడం కోసం..
ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. అయితే తాత్కాలిక బెయిల్ రావడంతో ప్రస్తుతం బయటకి వచ్చిన అల్లు అర్జున్ , బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే జరిగితే మళ్లీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారనడంలో సందేహం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సమస్యల నుండి అల్లు అర్జున్ బయటపడాలని, 41 రోజులపాటు కఠోర దీక్ష చేయబోతున్నట్లు సమాచారం.
గతంలో కూడా..
ఇకపోతే గతంలో కూడా అల్లు అర్జున్ పై ఏపీలో కేసు నమోదు అయినప్పుడు స్నేహ తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ ఏడుకొండల వాడి పైనే భారం పెట్టి తన భర్తను గండం నుంచి గట్టెక్కించమని ప్రార్థించబోతున్నట్లు సమాచారం.. మొత్తానికి అయితే భర్త కోసం భార్య పడే కష్టానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. మరి స్నేహ దీక్షపై నిజా నిజాలు తెలియనున్నాయి.