Allu Arjun – Thumps up.. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో లేదా హీరోయిన్ స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత వారితో యాడ్స్ చేయించడానికి పలు కంపెనీలు పోటీపడతాయి.
ముఖ్యంగా ఆ యాడ్స్ లో అప్పటికే స్టార్ హీరోలు చేస్తున్నప్పటికీ, క్రేజ్ పరంగా కొత్తవారిని తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోలు కూడా వాణిజ్య ప్రకటనల కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డులు సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. ముఖ్యంగా థండర్ కోసం వైల్డ్ ఫైర్ అనిపించుకున్న అల్లు అర్జున్(Allu Arjun) ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం.
పుష్ప 2 సినిమాతో భారీ క్రేజ్..
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. 14 రోజుల్లోనే రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రూ.2 వేల కోట్ల క్లబ్లోకి చేరడానికి అడుగులు వేస్తోంది. ఇకపోతే సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని బన్నీ యాడ్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన చేతుల్లోకి థమ్స్ అప్ యాడ్ వచ్చి చేరింది. ఒకప్పుడు ఈ బ్రాండ్ కి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా, ఆ తర్వాత పోకిరి సినిమా క్రేజ్ తో మహేష్ బాబు(Mahesh Babu)చేతుల్లోకి ఈ ప్రోడక్ట్ కాంట్రాక్టు వెళ్లిపోయింది. అలా 2006 నుండి 2023 వరకు మహేష్ బాబు మాత్రమే ఈ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించారు.
థమ్స్ అప్ యాడ్ కోసం భారీ రెమ్యూనరేషన్..
అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ ని అల్లు అర్జున్ తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందు థమ్స్ అప్ కాంట్రాక్టు ను తీసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా విడుదలైన తర్వాతే ఈ యాడ్ టీవీలో టెలికాస్ట్ అవ్వడం మొదలు పెట్టింది. మొత్తానికైతే అల్లు అర్జున్ క్రేజ్ ను బట్టి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని సమాచారం. అంతేకాదు ఈ కాంట్రాక్టుకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉందని చెప్పాలి. ఒక్కో యాడ్ వీడియో చేయడానికి ఆయన 12 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ఇది ఇండియాలోనే ఆల్ టైం రికార్డ్ రెమ్యూనరేషన్ అని కూడా చెప్పవచ్చు.. ఒకప్పుడు మహేష్ బాబు ఒక్కో థమ్స్ అప్ యాడ్ కోసం రూ.6కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే , ఇప్పుడు అల్లు అర్జున్ దానికి రెండింతలు ఎక్కువగా తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు మరో ఐదేళ్లపాటు ఈ కాంట్రాక్టు అల్లు అర్జున్ చేతుల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే అల్లు అర్జున్ సెలెక్టివ్ గా బ్రాండ్స్ ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు ఈ బ్రాండ్స్ ద్వారానే ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారట.అందుకే ప్రస్తుతం ఆయన ఆస్తులు కూడా పెంచుకుంటున్నట్లు సమాచారం.