BigTV English
Advertisement

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్.. ?

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్.. ?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా ఇప్పుడప్పుడే తగ్గేలా  లేదు.  ముఖ్యంగా పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఆ  కలక్షన్స్ ఆపడం ఎవరివలన కావడం లేదు. ఇప్పటివరకు పుష్ప 2 రూ . 1600 కోట్లు రాబట్టి  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ కలక్షన్స్ రాబట్టిన సినిమాగా  గుర్తింపు తెచ్చుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటనకు ఫాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.


మూడేళ్ల క్రితం పుష్ప సినిమా రిలీజ్ అయ్యి  ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత బన్నీ ఐకాన్ స్టార్ గా మారాడు. అంతేకాకుండా ఆ సినిమాకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. అలాంటి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై ఫాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకోవాలో  అని అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఆఅంచనాల మధ్యనే డిసెంబర్ 4న పుష్ప 2 రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ ఏడాది మొత్తం బన్నీపై వివాదాలు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో వివాదాలు కారణంగా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని, నెగటివ్ టాక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ, వాటినేమీ పట్టించుకోకుండా ప్రేక్షకులు కథ నచ్చి సినిమాను విజయం బాట పట్టించారు. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా తన సత్తా చాటుతూ వస్తుంది. దాదాపు ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా పుష్ప 2 సినిమా కలెక్ట్ చేసినంత కలక్షన్స్ రాబట్టలేకపోయింది.


ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకుందని, సంక్రాంతి కానుకగా పుష్ప 2 ఓటీటీలో  రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

” పుష్ప 2 ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. రాబోయే అతిపెద్ద హాలిడే సీజన్లో ఈ మూవీని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. విడుదలైన  నాటి నుంచి 56 రోజులు కన్నా ముందు పుష్ప 2  ఓటీటీలో స్ట్రీమింగ్ కాదు. ఇది వైల్డ్ ఫైర్ పుష్ప.. వరల్డ్ వైడ్ థియేటర్ లోనే వస్తుంది”  అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశను కలిగించింది .

ఇక ఈ నిరాశను పోగొట్టడానికి మరో గుడ్ న్యూస్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. క్రిస్టమస్ సందర్భంగా పుష్ప 2  మూవీలో మరో 18 నిమిషాల నిడివి ఉన్న సీన్స్ ను యాడ్ చేశారట. క్రిస్మస్ నుంచి థియేటర్లో 18 నిమిషాలు యాడ్ చేసిన సినిమా స్క్రీనింగ్ కానుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా నిడివి మూడు గంటల 20 నిమిషాలు ఉంది. క్రిస్మస్ తర్వాత నుంచి మూడు గంటల 38 నిమిషాలు కాబోతుంది. మరి ఈ యాడ్ చేసిన సీన్స్ వల్ల పుష్పటు కలెక్షన్స్ మరింత పెరుగుతాయో లేదో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×