BigTV English

Allu Arjun: ఇకపై బన్నీని అలా పిలవకండి.. ఫ్యామిలీ మెంబర్స్ కఠిన నిర్ణయం.!

Allu Arjun: ఇకపై బన్నీని అలా పిలవకండి.. ఫ్యామిలీ మెంబర్స్ కఠిన నిర్ణయం.!

Allu Arjun.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. 2021లో ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ తో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. కానీ ఈయన మెడకు ఉచ్చు బిగుసుకుంది అని చెప్పవచ్చు. దీనికి కారణం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ప్రధాన కారణం. బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరణించడంతో ఈ వివాదంలో అల్లు అర్జున్ చిక్కుకొని ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు.


అల్లు అర్జున్ పేరుపై కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం..

ఇకపోతే అల్లు అర్జున్ అలా జైలుకు వెళ్లారో లేదో ఇక అప్పటినుంచి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్టయ్యారు అల్లు అర్జున్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రథమంగా ఈ అంశమే తెరపైకి వస్తోంది. దీంతో ఆయన పేరు ప్రతిష్టలకు ఇది పూర్తిగా మైనస్ కానుందని సమాచారం. దాదాపు 22 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ కష్టపడి ఎంతో పేరు దక్కించుకొని ఈ స్థాయికి వచ్చి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు అల్లు అర్జున్. ఇలాంటి ఈయన ఒక చిన్న పొరపాటు కారణంగా మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఇకపై అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే.. అల్లు అర్జున్ ని కేవలం అల్లు అర్జున్ అని పిలిస్తే చాలని, తన పక్కన స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ , పాన్ ఇండియా స్టార్ వంటివి జోడించాల్సిన అవసరం లేదని.. అదేవిధంగా ఇకపై ఎవరూ కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అని కూడా పిలవకూడదు అంటూ అల్లు ఫ్యామిలీ ఒక నోట్ విడుదల చేయడానికి సిద్ధమైందని సమాచారం.


ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..

ఇకపోతే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా.. ఆయనను A11 ముద్దాయిగా అరెస్టు చేశారు. దీంతో ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ప్రతిసారి కూడా అరెస్టు అయిన అల్లు అర్జున్ అని చెప్పడంతో అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు.. అందుకే అల్లు అర్జున్ ని ఇకపై అలా పిలవకూడదని అల్లు ఫ్యామిలీ సరికొత్త కండిషన్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అల్లు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×