OTT Movie : రొమాంటిక్ సినిమాలకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటిటిలో ఉండే మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు లిస్ట్ లో రొమాంటిక్ సినిమాల లిస్ట్ పెద్దదే. అలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక ధనిక అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్టోరీ రొటీన్ గా ఉన్నా, తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. అందుకే ఈ మూవీ థియేటర్లలో విజయం సాధించింది. ఈ మూవీ చివరి వరకు రొమాంటిక్ సీన్స్ తో పిచ్చెక్కిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ తమిళ రొమాంటిక్ మూవీ పేరు ‘ఇస్పడే రాజవుం ఇధయ రాణియుమ్’ (Ispade Rajavum Idhaya Raniyum). ఈ మూవీకి రంజిత్ జెయకోడి దర్శకత్వం వహించారు. ఇందులో హరీష్ కళ్యాణ్, శిల్పా మంజునాథ్ ప్రధాన పాత్రల్లో నటించగా… ఆనంద్, బాల శరవణన్, సురేశ్, పొన్వన్నన్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2019 మార్చి 15న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar)లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
మధ్యతరగతికి చెందిన గౌతమ్ అనే యువకుడికి కోపం కంట్రోల్ చేసుకోలేని సమస్య ఉంటుంది. అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల అతని బాల్యం విషాదంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతనిలో ఒక రకమైన అభద్రతా భావం, కోపం పెరిగిపోతాయి. ఇక ఈ హీరో కనీసం ఉద్యోగం చేయకుండా తన స్నేహితులతో సమయం గడుపుతూ ఉంటాడు. ఒక రోజు గౌతమ్ అనుకోకుండా తారా అనే అమ్మాయిని కలుస్తాడు. తారా ఒక మోడ్రన్ అమ్మాయి. రిచ్ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మాయికి రోహిత్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుగుతుంది. తరువాత గౌతమ్, తారాకు మధ్య అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. తరచుగా కలుస్తూ ఉండే వీరిద్దరూ ప్రేమలో పడతారు.
వారి ప్రేమకథ మొదట సంతోషంగా సాగుతుంది. కానీ గౌతమ్ కి ఉన్న కోపం, అభద్రతాభావం వారి సంబంధాన్ని సమస్యల్లో పడేస్తుంది. తారా తన కుటుంబాన్ని ఒప్పించడానికి సమయం కావాలని కోరుతుంది. కానీ గౌతమ్ దూకుడుతనం, అతని ప్రవర్తన వారి మధ్య గొడవలకు దారితీస్తాయి. తారా, గౌతమ్ ప్రవర్తనను భరించడం కష్టమవుతుంది. అయినప్పటికీ ఆమె అతన్ని ప్రేమిస్తుంది. గౌతమ్ తన మీద తనకే కోపం వచ్చేలా ప్రవర్తిస్తాడు. ఆ తరువాత గౌతమ్ తన లోపాలను గుర్తించి, తన కోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి వారి సంబంధం ఎలా ముగుస్తుంది ? వారు కలిసి ఉంటారా లేక విడిపోతారా ? అనేది ఈ తమిళ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోండి.
Read Also : గతం మరిచిపోయే పెళ్ళాం … కొత్తగా వచ్చే ప్రియురాలు … ఇదెక్కడి ట్రయాంగిల్ లవ్ స్టోరీరా నాయనా