BigTV English

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Amaran.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) ఈసారి మేజర్ భార్యగా రియల్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. తాజాగా ఆమె నటిస్తున్న అమరన్ చిత్రం నుంచి ఆమెకు సంబంధించిన ఇంట్రో వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan)తో అమరన్(Amaran ) సినిమా చేస్తోంది సాయి పల్లవి.. రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నిజజీవిత ఘటన ఆధారంగా వస్తున్న ఈ చిత్రానికి కమల్ హాసన్ కు చెందిన RKFI పండు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.


తెరపైకి మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్..

ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి శివ కార్తికేయన్ పాత్రకు సంబంధించిన లుక్కు తో పాటు సాంగ్ ను కూడా మేకర్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే, సినిమాలో ఎక్కువ భాగాన్ని కాశ్మీర్లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ లొకేషన్లో సాయి పల్లవి, శివ కార్తికేయన్ దిగిన ఫోటోలు సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకుముందు ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ వదిలారు. ఇందులో మేజర్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నట్లు సమాచారం.


మేజర్ భార్యగా సాయి పల్లవి ఇంట్రో వీడియో రిలీజ్..

ముకుంద్ వరదరాజన్ గా శివ కార్తికేయన్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాయి పల్లవి ఇంట్రో వీడియో చాలా వైరల్ గా మారుతోందని చెప్పవచ్చు. ఈ వీడియోను సాయి పల్లవి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అంశంతో ప్రారంభించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాకోబామా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఫైల్ ఫుటేజ్ ను కూడా చూపించారు. మేజర్ ముకుంద్ వీర మరణాంతరం ఆయన భార్య ఇందు (సాయి పల్లవి) కి కేంద్ర ప్రభుత్వం పురస్కారం అందజేసే సన్నివేశాలను కూడా ఇందులో ఆడ్ చేశారు. వీరి మధ్య ప్రేమ, పెళ్లి , కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. సాయి పల్లవి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో జీవించినట్టు మనకు అర్థమవుతుంది. తన యాక్టింగ్ తో మరోసారి ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. శివ కార్తికేయన్ తో ఈమె కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. మొత్తానికి అయితే సాయి పల్లవి అభిమానులకు మేకర్స్ బ్యూటిఫుల్ ట్రీట్ ఇచ్చారని చెప్పవచ్చు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంతో సాయి పల్లవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×