BigTV English
Advertisement

Amigos : ‘అమిగోస్‌’ అంటున్న కళ్యాణ్ రామ్.. మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో నందమూరి హీరో

Amigos : ‘అమిగోస్‌’ అంటున్న కళ్యాణ్ రామ్.. మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో నందమూరి హీరో

Amigos : టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. రీసెంట్‌గా ‘బింబిసార’ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించారు. ఈ భారీ విజ‌యం త‌ర్వాత నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న NKR 19 చిత్రానికి మేక‌ర్స్ సోమ‌వారం రోజున ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్నమైన పాత్ర‌లు, సినిమాలు చేసే హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న ఈ సినిమా టైటిల్ కూడా డిఫ‌రెంట్‌గా ఉండ‌టంతో అంద‌రిలో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.


‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అమిగోస్ అనేది స్పానిష్ ప‌దం. ఓ స్నేహితుడిని సూచించ‌డానికి లేదా రెఫ‌ర్ చేయ‌డానికి ఈ ప‌దాన్ని ఉప‌యోగిస్తుంటారు. ఈ టైటిల్ అనౌన్స్ చేయ‌టంతో పాటు స్టైలిష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సినిమా కాన్సెప్ట్ ఏంట‌నే విష‌యాన్ని సూచిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ పాత్ర మూడు షేడ్స్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పోస్ట‌ర్ ఎలివేట్ చేస్తుంది.

‘దే సే వెన్ యు మీట్ సమ్‌బ‌డి ద‌ట్ లైక్స్ యు, యువ‌ర్ డై’ అనేది పోస్ట‌ర్‌పై క్యాప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మేక‌ర్స్ మ‌రింత‌గా పెంచేశారు. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌టంతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×