BigTV English

Amitabh Bachchan : అమితాబ్ ను ఇలా చేశారేంట్రా బాబు .. కొంచెం కూడా బుద్దిలేదంటూ..

Amitabh Bachchan : అమితాబ్ ను ఇలా చేశారేంట్రా బాబు .. కొంచెం కూడా బుద్దిలేదంటూ..

Amitabh Bachchan : సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కొత్త టెక్నాలజీ తో జనాలను అబ్బురపరిచే ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. అయితే దేశం అభివృద్ధికి వాడితే అది బాగానే ఉంది కానీ కొంతమంది టెక్నాలజీతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సమాజంలో పెద్ద మనుషులను తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సెలెబ్రేటిల డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలా.. బాధపడాలో అర్థంకాని పరిస్థితులు నేటి సమాజంలో నెలకొన్నాయి. సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ కొన్ని కుటుంబాల పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా జరిగాయి. కొందరు సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన దుండగులు బాలీవుడ్ స్టార్ హీరో ను కూడా వదల్లేదు. ఆయన అసభ్యకరమైన ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ ఏఐ వల్ల ఎంతో మంది సెలెబ్రేటీలు ఇబ్బందులు పడ్డారు. హీరోయిన్ల బోల్డ్ సీన్లతో పాటుగా, కొన్ని నగ్నంగా ఉండే ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. గతకొన్ని రోజుల క్రితం అవి ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము.. ఏఐ వల్ల బాధింపబడ్డ సెలెబ్రేటీలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో ప్రముఖ నటుడు వచ్చి చేరాడు.. తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కోడలికి లిప్ కిస్ పెడుతున్న ఓ నకిలీ వీడియోను సృష్టించి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహంతో పాటు, ఆందోళన వ్యక్తం చేశారు. కోపంగా ఉన్న ఎమోజీని అమితాబ్ పోస్టు చేశారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు తయారుచేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇటీవల కాలంలో గట్టిగా వినిపిస్తోంది. సైబర్ పోలీసులు ఎంతగా జాగ్రత్త పడుతున్న ఇలాంటివి పునారావృతం అవ్వడం బాధాకరం..

ఇకపోతే అమితాబ్ కు సంబందించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు, కోడలు విడాకులు తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో ఇలాంటి ఫోటో బయటకు రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న కేటుగాళ్లు రానున్న రోజుల్లో సామాన్యులకు సంబంధించిన ఇలాంటి వీడియోలను సృష్టిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడమే కష్టం.. టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలో ప్రభుత్వాలు సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తూ బెదిరింపులకుదిగే పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి వాటి పై చర్యలు తీసుకోకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి తప్పదు అని డిమాండ్ వినిపిస్తుంది..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×