Allahabad to Varanasi Train 18: భారతీయ రైల్వే వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసిన వందేభారత్ రైళ్లు, తక్కువ కాలంలోనే ప్రయాణీకులకు మరింత చేరువయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 130కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. అన్ని రైళ్లు 100 శాతం అక్యుపెన్సీని కలిగి ఉంటుంది. ఎప్పటికప్పుడు వందేభారత్ రైళ్లను రైల్వే అధికారులు అప్ డేట్ చేస్తూ వెళ్తున్నారు. త్వరలోనే దేశంలో తొలి స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లలో అందించే ఫుడ్ విషయంలో రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫుడ్ కు సంబంధించి కొత్త ఆప్షన్
ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఫుడ్ ఛార్జీలను కలిపే టికెట్ ధర ఉండేది. అంటే, టికెట్ తీసుకున్న ప్రతి వారికి ఫుడ్ ఛార్జీ అనేది అందులోనే కలిపి ఉంటుంది. అంటే, టికెట్ తీసుకుంటే, ఫుడ్ ఛార్జీ కచ్చితంగా అందులోనే వసూళు అవుతుంది. కానీ, త్వరలో అందుబాటులోకి రాబోయే వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులకు ఫుడ్ కావాలా? వద్దా? అనే ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. తొలిసారి అలహాబాద్ నుంచి వారణాసి వరకు వెళ్లే వందేభారత్ (ట్రైన్ 18) రైళ్లో ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో IRCTC అందించే ఫుడ్ కావాలా? వద్దా? అని నిర్ణయించుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వద్దు అనుకున్న వాళ్లకు వారి టిక్కెట్ ధరలలో క్యాటరింగ్ ఛార్జీలు యాడ్ చేయరు. ఫుడ్ కోసం అధిక ఛార్జీలు విధించడం, క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో సమస్యల కారణంగా ప్రయాణీకుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.
ఒక్కో టికెట్ పై రూ. 250 తగ్గింపు
ఫుడ్ వద్దనే ఆప్షన్ కారణంగా వందేభారత్ రైళ్లలో టికెట్ పై సుమారు రూ. 250 వరకు తగ్గే అవకాశం ఉంది. “స్టేషన్ల మధ్య క్యాటరింగ్ ఛార్జీలు నిర్ణయించబడుతాయి. అవి ప్రయాణీకుల టికెట్ ఛార్జీకి యాడ్ చేయబడుతాయి. అయితే, వారణాసి నుంచి అలహాబాద్ లేదంటే అలహాబాద్ నుంచి వారణాసి వరకు క్యాటరింగ్ సేవలను నిలిపివేసుకునే అవకాశం ఉంది. బుకింగ్ సమయంలో వారు ఫుడ్ వద్దు అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రయాణీకులకు IRCTC ద్వారా ప్రత్యేక రిసీట్ ను జారీ చేస్తుంది” అని రైల్వే అధికారులు తెలిపారు.
వందేభారత్ రైళ్లలో ఫుడ్ ధరలు
ఎగ్జిక్యూటివ్ క్లాస్, చైర్ కార్ క్లాసులకు వేర్వేరు ఫుడ్ ఛార్జీలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో న్యూ ఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణించే వారికి ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కోసం రూ.399 ఛార్జ్ చేయబడుతుంది. చైర్ కార్‌లో ప్రయాణీకులు రూ.344 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, శతాబ్ది రైళ్ల స్థానంలో వచ్చే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్లు ప్రీమియం రైలు ధరల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ రైలు కాన్పూర్, ప్రయాగ్ రాజ్ లో హాల్టింగ్ అవకాశాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఎనిమిది గంటల్లో 755 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. ఈ మార్గంలో ఇదే అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందనుంది.
Read Also: కాశ్మీర్ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?