Best Real-Life Inspired movies : నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తరికెక్కిన సినిమాలు థియేటర్లలో ఘనవిజయం సాధించాయి. వాస్తవాలకి దగ్గరగా ఉండే ఇటువంటి సినిమాలను, ప్రేక్షకులు ఎప్పటికి ఆదరిస్తారని మరొక్కసారి ఋజువుచేశాయి. ఈ సినిమాలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. మంచి కంటెంట్ తో వచ్చిన రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ది కాశ్మీర్ ఫైల్స్ (The kashmir Files)
2022 థియేటర్లలో వచ్చిన ఈ మూవీకి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వమహించారు. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జాతీయ అవార్డును కూడా అందుకుంది. కాశ్మీరీ పండిట్లపై జరిగిన అమానుష ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది సర్జికల్ స్ట్రైక్ (The Surgical strike)
ఈ మూవీ 2019లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. 25 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్, యామి గౌతమ్ ప్రధాన పాత్రలుగా నటించారు. విక్కీ కౌశల్ మేజర్ పాత్రలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 2016 ‘ఉరీ’ దాడి తర్వాత భారత సైన్యం సాగించే పోరాటమే ఈ సర్జికల్ స్ట్రైక్. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ నాలుగు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఆదిత్య ధర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
కేదార్నాథ్ (Kedarnath)
సుశాంత్ సింగ్ రాజపుత్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2018 లో 2022 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 2013లో ఉత్తరాఖండ్ వరదలకు ఎంతో మంది బలి అయ్యారు. ఈ విపత్తు నేపధ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. నిజ జీవితంలో జరిగిన ఇద్దరి వ్యక్తుల ప్రేమ కధను ఈ మూవీలో చక్కగా ప్రెసెంట్ చేశారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి అభిషేక్ కపూర్ దర్శకత్వమహించాడు. ఈ మూవీ సుశాంత్ సింగ్ రాజపుత్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది సబర్మతి రిపోర్టు (The Sabarmati Report)
ఈ బాలీవుడ్ మూవీ 2024 నవంబర్ 15న 2022 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్రాంత మాసే, రాశిఖన్నా, రిద్ది డోగ్రా ప్రధాన పాత్రధారులుగా నటించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. 2002లో గుజరాత్ అల్లర్లు ఎంత భయంకరంగా జరిగాయో ఈ మూవీ తెలియజేస్తుంది. ఈ ఘటనల వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీసేందుకు ఒక జర్నలిస్టుల బృందం ముందుకు వెళ్తుంది. వారు చేసే సాహసం అభినందనీయంగా ఉంటుంది. ఈ మూవీకి ధీరజ్ సర్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో తెరకెక్కించారు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.