Anaganaga Oka Raju Movie : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలో కనిపించిన నవీన్. ఆ తర్వాత తెలుగు ఫిలిమ్స్ కి కొన్ని ఏళ్లపాటు గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి ఫేమస్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత నవీన్ చేసిన సినిమా జాతి రత్నాలు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు నవీన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.
నవీన్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నవీన్ కొంత టైం తీసుకున్న కూడా క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి ఒక సినిమాకి సైన్ చేశాడు అని అంటే ఏమీ ఆలోచించకుండా సినిమాకి వెళ్లిపోవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అనగనగా ఒక రాజు అనే సినిమాను చేస్తున్నడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను దాదాపు రెండేళ్ల క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే మొదటి ఈ సినిమాలో నవీన్ సరసన శ్రీ లీలా హీరోయిన్ గా కనిపిస్తుంది అని అప్పట్లో వార్తలు వినిపిస్తూ వచ్చేవి. అలానే ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు అంటూ అధికారికంగా అనౌన్స్ చేసి వీడియోలో కూడా తమన్ పేరును వేశారు.
కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు లేట్ కావడంతో దర్శకుడు కళ్యాణ్ శంకర్ మ్యాడ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం తన మూడవ సినిమా అనగనగా ఒక రాజు కూడా సిద్ధం చేస్తున్నాడు కళ్యాణ్ శంకర్. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. నవీన్ కామెడీ ఇ టీజర్ లో పుష్కలంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో నవీన్ కి జంటగా మీనాక్షి చౌదరి కనిపిస్తుంది. అలానే మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నట్లు అఫీషియల్ గా రిలీజ్ చేసిన వీడియోలో తెలిపారు. ఈ ప్రాజెక్టు లేట్ కావడంతో, ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు మారిపోయారు. ఒకటి హీరోయిన్ శ్రీలీలా రెండు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
Also Read : Rashmika Mandanna : పరిస్థితి కూల్ అయింది… రష్మికా.. ఇప్పుడైనా బయటికి రా….