AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో వర్షాలు కురుస్తున్నాయి. వరుస అల్పపీడనాలతో వర్షాల ముప్పు తప్పటం లేదు. తాజాగా పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. రానున్న రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
also read: AP Govt: ఏపీలో సూపర్ స్కీమ్.. అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోండి!
ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడుతుండడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం పరిసర ప్రాంతాల్లో మంచుతెరలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో బొబ్బిలి, పార్వతీపురంలో నాలుగు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.