Anaganaga Oka Raju : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) మూవీ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు.
నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో జరిగింది. ఇక ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ను రిలీజ్ చేసి చాలా కాలమే అవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో అందరూ ఈ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా ఈ మూవీ నుంచి నవీన్ పొలిశెట్టి బర్త్ డే కానుకగా టీజర్ ను రిలీజ్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
టీజర్ 3 నిమిషాల 2 సెకండ్ల నిడివి ఉండగా, అందులో నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో అలరించారు. టీజర్ మొదట్లోనే అందరికీ గోల్డెన్ ప్లేట్స్ లో భోజనం వడ్డించమంటూ హడావిడి మొదలైంది. “స్వీటూ గోల్డే, ప్లేటు గోల్డే అంటున్నారు. ఇదేమన్నా మలబార్ గోల్డ్ వాళ్ళ పెళ్ళా?, ఏమండీ ఇది మా రాజు గారి పెళ్లి… ఆయన హార్టే గోల్డ్.. ” అని చెప్పిన డైలాగులు, ఆ తర్వాత అంబానీ పెళ్లిని టీవీలో చూస్తూ నవీన్ పొలిశెట్టి ఇచ్చిన ఎంట్రీ బాగున్నాయి. అంతేకాకుండా టీజర్ లో నవీన్ పోలీస్ శెట్టి ఏకంగా అంబానీతో ఫోన్ మాట్లాడుతున్నట్టు చూపించారు. అయితే అంబానీపై ఆయన వేసిన సెటైర్లు నవ్వులు పూయిస్తున్నాయి.
అంబానీ మాత్రమే కాదు అంబానీలో పెళ్లికి హాజరైన సెలబ్రిటీలను కూడా వదల్లేదు. కిమ్ కర్దాషియన్ ను కిమ్ కట్ డ్రాయర్, ఒకడు బనియన్ వేసుకుని ‘బేబీ బేబీ’ అని బాగా డిప్రెషన్ పాటలు పాడుకుంటూ తిరిగాడే జస్టిన్ బార్బర్, శీనుగాడు… అదే కండలు ఎక్కువ, బట్టలు తక్కువ జాన్ శీను గాడు అంటూ జాన్ సెనాను.. ఇలా ఫన్నీగా హాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను పలికారు. పైగా తన పెళ్లిలో కూడా వీళ్ళ అందరితో పర్ఫార్మ్ చేయిస్తానంటూ ఈ రాజు ఇచ్చిన బిల్డప్ అంతా కాదు. చివర్లో మీనాక్షి చౌదరి లుక్ ను కూడా రివీల్ చేశారు. మొత్తానికి కొత్తజంట అయితే బాగుంది. అలాగే టీజర్ ని చూశాక నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్ అనిపించాడు.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన బ్రేక్ తీసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ కి వాయిదా పడింది. గాయం నుంచి కకోలుకున్న ఆయన ఇటీవలే మళ్లీ షూటింగ్లను మొదలు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) టీజర్ ను రిలీజ్ చేశారు.