Virat Kohli Fined: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ లో చిన్నపాటి గొడవ చెలరేగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదవ ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా.. ఆసీస్ బ్యాటర్ స్యామ్ కాన్ స్టాన్ కి సిరాజ్ కి మధ్య మాటల యుద్ధం జరిగింది.
Also Read:: దాటిగా ఆడుతున్న ఆస్ట్రేలియా.. గిల్ లేకుండానే బరిలోకి టీమిండియా!
ఇక ఓవర్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ {Virat Kohli Fined} దూకుడుగా వెళుతూ కాన్ స్టాన్ భుజాన్ని తన భుజంతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు ప్లేయర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. దీంతో వెంటనే అంపైర్లు, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ తీరును ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లతో పాటు పలువురు విశ్లేషకులు తప్పుబట్టారు. కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ ఘటనపై స్పందించారు.
కోహ్లీ చేసింది ముమ్మాటికి తప్పేనని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. {Virat Kohli Fined} కోహ్లీ తీరు ఐసీసీ ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ఉందని.. మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకుంటే కోహ్లీ సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్ ఆడే అవకాశం లేదని అన్నారు. ఈ ఘటనపై రిఫరీ దృష్టి సారించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా వ్యాఖ్యానించారు. ఇక తొలి రోజు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది.
నిబంధనలు ఉల్లంఘించాడన్న కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజ్ లో 20% జరిమానాగా {Virat Kohli Fined} విధించింది. అంతేకాదు కోహ్లీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ ని కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో కోహ్లీ గతంలో కూడా ఇలాగే చేశాడంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా పాత వీడియోలను బయటపెడుతున్నారు.
Also Read: Naman Ojha’s Father: టీమిండియా క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల జైలు శిక్ష?
బెంగళూరులో 2019లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు టి-20 మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో సౌత్ ఆఫ్రిక ప్లేయర్ బ్యూరాన్ హెండ్రిక్స్ భుజాన్ని విరాట్ కోహ్లీ తగిలాడు. ఆ సందర్భంలో కూడా కోహ్లీ {Virat Kohli Fined} ఓ డీమెరిట్ పాయింట్ బారినపడ్డాడు. ఆ సందర్భంలో తాను చేసింది తప్పేనని కోహ్లీ అంగీకరించాడు కూడా. అయితే ఆటగాళ్లు రెండు సంవత్సరాల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లను పొందితే కొంతకాలం క్రికెట్ నుంచి నిషేధానికి గురవుతారు. ఈ నాలుగవ టెస్ట్ లో ఆసీస్ బ్యాటర్ తో కోహ్లీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024